టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి పెళ్లి కాని టాప్ స్టార్స్ ప్రభాస్ రానాలు ఏమీడియా సంస్థకు ఇంటర్వ్యూలు ఇచ్చినా వారి పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురుకావడం ఖాయం. వీరితో పాటు నితిన్ కు కూడా ఇప్పటివరకు పెళ్ళి అవ్వకపోయినా అందరి దృష్టి మాత్రం ప్రభాస్ రానా లపైనే ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో రానా ఈరోజు విడుదలైన ‘మహానాయకుడు’ మూవీని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసాడు. 

రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !
ఈ ఆన్ లైన్ ఛాటింగ్ లో రానా తన అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. కోలీవుడ్ హీరోలు ఆర్య విశాల్ లు నిన్నటి వరకు పెళ్ళికి దూరం అంటూ ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు పెళ్ళి చేసుకున్న పరిస్థుతులలో మీపెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించినప్పుడు రానా చాల వేదాంత ధోరణితో సమాధానం ఇచ్చాడు. ‘పెళ్లాడితే ఎవరికైనా మంచిది. అయితే నా పెళ్లి ఎప్పుడో నాకే తెలియని పరిస్థితి’ అంటూ తన పెళ్లి పై సమాధానం దాటివేసాడు. 

రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !
ఇదే సందర్భంలో ఒక అభిమాని ప్రభాస్ అనుష్కల గురించి ఒక్క మాటలో చెప్పు అని అన్నప్పుడు ‘వారంతా ఒకే ఫ్యామిలీ’ అంటూ తన దైన స్టైల్ లో జోక్ చేసాడు. ఇక మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ తనకు అందరి హీరోలతోనూ కలిసి నటించాలని ఉంది అని అంటూ తాను మల్టీ స్టారర్ మూవీలకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చాడు. 

రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !
ఇక ‘మహానాయకుడు’ పాత్రలో తాను చంద్రబాబు పాత్ర విషయంలో తాను పడ్డ టెన్షన్ గురించి వివరిస్తూ ‘బాహుబలి’ మూవీలో భల్లాలదేవ పాత్ర గురించి కూడ తాను అంత టెన్షన్ పడలేదనీ చెపుతూ తన కెరియర్ లో ‘మహానాయకుడు’ లోని చంద్రబాబు పాత్ర ఒక మైల్ స్టోన్ అని అంటున్నాడు. ఈరోజు విడుదలైన ‘మహానాయకుడు’ మూవీ టాక్ ను పక్కకు పెడితే చంద్రబాబు లుక్ అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ విషయంలో రానా కనపరిచిన నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: