విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘1920' అనే హిందీ హారర్ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన అదా శర్మ... తెలుగులో పూరి జగన్నాధ్ నితిన్ మూవీ ‘హార్ట్ ఎటాక్' చిత్రంలో నటించింది.‘హార్ట్ ఎటాక్' తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం చిత్రాల్లో నటించిన అదా శర్మ.. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ‘కల్కి'లో నటిస్తోంది. ఈ అమ్మడు మూవీలో కన్నా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్,వీడియోస్ గా బాగా ఆకర్షిస్తుంది.  తాజాగా, న్యూస్ పేపర్ ను పోలిన డ్రెస్ ధరించి మరోసారి కలకలం రేపింది.

స్టైల్ స్టేట్మెంటుతో హాట్ టాపిక్

న్యూస్ పేపర్ ప్రింట్ తరహాలో ఉన్న ఈ గౌన్ ను ఫయాజ్ జరీవాలా డిజైన్ చేశారు. ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదా శర్మ ఈ వెరైటీ డ్రెస్ లోనే వచ్చింది. అదా క్లీవేజ్ షో అభిమానుల మతి పోగొడుతోంది.అదా శర్మ ధరించిన న్యూస్ పేపర్ డ్రెస్ డిజైన్ చూడగానే తెలుగు ప్రేక్షకులంతా జంధ్యాల మూవీ ‘అహనా పెళ్లంట' గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదా శర్మ ఈ పేపర్ డ్రెస్సు వేసింది మాత్రం డబ్బు ఆదాచేయడం కోసం కాదట..నైకా ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 వేడుకలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలనే ఈ డ్రెస్ వేసుకుందట.

అదా శర్మ

అయితే అందరికీ ఓ డౌట్ వచ్చే ఉంటుంది..మరి పేపర్ చిరిగిపోతే ఎలా? ఆ డౌట్స్ మాత్రం రానీయకండి.. ఎందుకంటే అది రియల్ పేపర్ కాదు, పేపర్ మాదిరిగా కనిపించే ప్రింటెడ్ క్లాత్‌తో ఈ డ్రెస్ డిజైన్ చేశారట. ఈ న్యూస్ పేపర్ డ్రెస్ లో తాను ఎంత విలక్షణంగా ఉందో సోషల్ మీడియాలో పోస్టు పెట్టి మురిసిపోయింది ఆదా శర్మ. లక్షల్లో లైకులు వస్తుండడంతో తన కొత్త డ్రెస్ కు అభిమానులు ఆమోదం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తోంది.

ప్రత్యేకంగా కనిపించాలనే



మరింత సమాచారం తెలుసుకోండి: