ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ క్రిష్ బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఏర్పడిన కొన్ని చిన్నచిన్న భేదాభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియచేసాడు. వాస్తవానికి ఈసినిమాను రెండు భాగాలుగా తీయాలి అన్నది తన ఆలోచన కాదనీ అది బాలయ్య ఆలోచన మాత్రమే అంటూ తన పై వచ్చిన అపవాదులను తొలిగించుకోవడానికి ప్రయత్నాలు చేసాడు.
Stunning Paycheck for Director Krish
ఇదే సందర్భంలో క్రిష్ మరొక ట్విస్ట్ ఇస్తూ తనకు బాలయ్య పూర్తి స్వేచ్చ ఇచ్చి ఉంటే ఈమూవీకి ‘కథానాయకుడు’ ‘మహానాయుకుడు’ అని కాకుండా ‘తారకరాముడు’ అని పేరు పెట్టి ఉండేవాడిని అని తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. తన దృష్టిలో ఫలితం కన్నా ప్రయత్నం గొప్పది అని అంటూ ‘కథానాయకుడు’ పరాజయం తనను ఏమాత్రం నిరాశ పరచలేదు అని అంటున్నాడు. 

ఇక ‘కథానాయకుడు’ పరాజయం పై స్పందిస్తూ ఈమూవీ పరాజయం తనకు ఒక భేతాళ ప్రశ్నగా మారిపోయిందని కలక్షన్స్ పరంగా నిరాశ పరిచిన ఈమూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన వెంటనే ఈమూవీ బాగుంది అంటూ తనకు వచ్చిన కొన్ని వేల సందేశాలతో తన సెల్ ఫోన్ నిండిపోయిన విషయాన్ని వివరించాడు. ఒకవేళ తాను ఈసినిమాను బాగా తీయలేకపోతే ఇన్ని ప్రశంసలతో కూడిన సందేశాలు ఎందుకు వచ్చాయో తనకు అర్ధం కాకుండా మారి తన మైండ్ బ్లాంక్ అయింది అని అంటున్నాడు. 
Director Krish Love Story As TV Serial
అదేవిధంగా ‘కథానాయకుడు’ పరాజయానికి ప్రతి వ్యక్తి కొన్ని వందల కారణాలు చెపుతున్నారు కానీ అసలు కారణం ఇది అని చెప్పకపోవడంతో తాను విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతున్న విషయాలను వివరించాడు. ఒక సినిమా విడుదల అయ్యాక కేవలం నెలరోజుల్లోనే ఆన్ లైన్ లో మంచి క్వాలిటీతో కనిపిస్తున్న నేపధ్యంలో ఎవరూ ఊహించని అద్భుతమైన కథలు చెప్పినప్పుడు మాత్రమే జనం ధియేటర్లకు వస్తున్నారని అంటూ ఈపరిస్తుతులలో సినిమా కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత అద్భుతంగా తీసినా జనం రారు అన్న విషయం గుర్తించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అంటూ ‘కథానాయకుడు పరాజయానికి తన వైపు కారణాలను వివరిస్తున్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: