అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఫిబ్రవరి 24వ తారీఖుకు సంవత్సరం అవుతోంది. దుబాయ్ లో ఒక స్టార్ హోటల్ బాత్రూమ్ లో అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయిన శ్రీదేవి మరణం ఇప్పటికీ మిష్టరీగానే కొనసాగుతోంది. ఆమె చనిపోయి సంవత్సర కాలం అవుతున్నా ఆమె జ్ఞాపకాలు ఇంకా ఆమె అభిమానులలో కొనసాగుతూనే ఉన్నాయి. 
Photo credit: Pinterest
ఈ నేపధ్యంలో శ్రీదేవి భర్త బోనీకపూర్ ఒక స్వచ్చంద సంస్థ కోసం ఆమె ఎంతో ఇష్టపడే కోటా శారీని ఆన్ లైన్ లో వేలం పాటకు పెట్టాడు. ఈ శారీకి కనీస ధర బోనీకపూర్ 40 వేలు నిర్ణయిస్తే అప్పుడే ఈశారీ దక్కించుకోవడం కోసం సుమారు లక్ష రూపాయల వరకు ఆన్ లైన్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. 

శ్రీదేవి మరణించిన తేదీ వరకు కొనసాగే ఈ ఆన్ లైన్ వేలం పాటకు వస్తున్న స్పందనను బట్టి ఈశారీకి కనీసం 5 లక్షల పైన ఆఫర్స్ వచ్చే ఆస్కారం ఉంది. 50 సంవత్సరాల వయసు దాటిపోయాక కూడ గ్లామరస్ గా కనిపించడానికి ఎంతో ఇష్టపడే శ్రీదేవికి చీరలు అంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. 
Sridevi dressed up in her favourite red and golden Kanchivaram saree for a last time
తాను ఎంతో ప్రేమగా పెంచిన జాహ్నవి ఫిలిం ఎంట్రీ ఫలితం చూడకుండానే మరణించిన శ్రీదేవి జాహ్నవి నటనకు వచ్చిన ప్రశంసలు చూసి ఆమె ఏలోకంలో ఉన్నా  ఆనందిస్తుంది. సెలెబ్రెటీల జీవితాలలో బయటపడని ఎన్నో చీకటి కోణాలకు ఉదాహరణ శ్రీదేవి జీవితం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: