టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు2’సీక్వెల్ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం అయ్యిందని..కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.   ఈ సినిమాలో విలన్ గా సిద్దార్థ మరో ముఖ్యపాత్రలో శింబు నటిస్తున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారతీయుడు 2 సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
Image result for indian 2 movie
లైకా ప్రొడక్షన్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో శంకర్ కి కొన్ని కండీషన్లు పెట్టారని..ఆ విషయంలోనే సినిమా పెండింగ్ పడిపోయిందని..సెట్టింగ్స్ సరిగా కుదరలేదని అందుకోసమే సినిమా ఆగిపోయిందని రక రకాలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా భారతీయుడు 2 గురించి మరో కొత్త అప్ డేట్స్ వస్తున్నాయి.  కమల్‌హాసన్‌ వృద్ధుడి పాత్రలో సరిగ్గా కుదరలేదని.. ఇటీవల చిత్రీకరణను తాత్కాలికంగా ఆపినట్లు సమాచారం.

ఏఆర్‌ రెహమాన్‌ కావాలంటూ కమల్‌ పట్టుబడుతున్నారని కూడా చెబుతున్నారు. కానీ శంకర్ మాత్రం ఈసారి  అనిరుధ్‌ తో పనికానిద్దామని పట్టుబడుతున్నారట. ఇన్ని సమస్యల నడుమ ఈ సినిమా కొనసాగడం కష్టమేనని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ అంశానికి సంబంధించి నిర్మాత, దర్శకుడు చర్చించారని తెలుస్తోంది. 

మళ్లీ మేకప్‌మేన్‌లను రప్పించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సంగీత దర్శకుడిగా అనిరుధ్‌నే ఖరారు చేసినట్లు సమాచారం. చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో పెద్ద సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ వేగవంతం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: