తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి.  క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మొదటి భాగం సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’రిలీజ్ అయ్యింది.  నేడు రెండో బాగం ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అయ్యింది.  అయితే ఈ చిత్రం ప్రీమియం టాక్ షో కొంత మంది పాజిటీవ్ గా స్పందిస్తుంటే మరొకింత మంది విమర్శిస్తున్నారు. 
Image result for mahanayakudu
తాజాగా ‘ఎన్టీఆర్ మహా నాయకుడు’చిత్రంలో చంద్రబాబు గొప్పతనాన్ని చూపించినట్లు వార్తలు వస్తున్నాయని ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు.  బాలకృష్ణకు సీఎం చంద్రబాబు వియ్యంకులు..అంతే కాదు టీడీపీ ఎమ్మెల్యే అందుకే చంద్రబాబు ని ఖచ్చితంగా పాజిటీవ్ గానే చూపిస్తారని అన్నారు. అంతే కాగు గతంలో  వాళ్లిద్దరి మధ్య వైస్రాయి ఒప్పందాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
Image result for mahanayakudu
కాబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా మూవీ తీసేంత ధైర్యం బాలకృష్ణకు లేదని స్పష్టం చేశారు.  అంతే కాదు చంద్రబాబు.. ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్ని బాలకృష్ణ చూపిస్తారని తనతో పాటు ఎవ్వరికీ నమ్మకం లేదని లక్ష్మీపార్వతి అన్నారు.  ఈ కారణంతోనే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో నా పాత్ర ప్రస్థావన తీసుకు రాలేదు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో అనుభవించిన కష్టాలు, తమ అనుబంధం ప్రధానాంశంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రంలో ఉంటుందని తెలిపారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: