ప్రపంచంలోని సౌందర్యాన్నంతా  రాసిపోసి ఒక చిత్రంలో చూపినా కూడా ఇంత అందంగా ఉంటుందా! ఆ అందాన్ని చూస్తే అసలు అందానికే అసూయతో కళ్లుకుట్టి దిష్టి తగిలేలా లేదు! అయినా ఇలలో ఇంత అందమా! విరిసిన ముద్ద మందారమా!  ముగ్ధ సింధూరమా! 

 

ఆ పోటోషూట్ లో  చూడగానే మది చెదిర్చిన మనోహర చిత్ర మాలలోని ఒక చక్కని ఫోటో మీ కోసం.  


“ఓరి బ్రహ్మదేవుడో! కొంప ముంచినావురో! అసలు ఈ లోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా!” అంటూ రాం గోపాల్ వర్మ హృదయ నాయకి, శ్రీదేవిని తలచుకుంటూ ఆమె పైనే ఈ గీతాన్ని చిత్రీకరించారు.  అలాంటి భావనే పై చిత్రం చూస్తే కలుగు తుంది కదూ!


“ఇలలో ఎలాగూలేదు కనీసం కలలో నైనా చూడలేదే!” కన్నుల్లోనో, కలల్లోనో, వెన్నెల్లోనో, వెన్నెలవానల్లోనో తడిసిన అదిరే అందాల రాశివే ! విరిసే నా సమ్మొహనానివే! పరవశమిచ్చే సుమసౌరభానివే! యువ హృదయాల్లో "జగన్మోహనం అంటూ గిలిగింతలు" పెట్టే అనుభూతిలో పడపోని పోరగాడెవడైనా ఉంటాడా? అంతలా సౌందర్య సమ్మోహన మాయలో పడేస్తున్న అందాల విరిబోణి,  నెమ్మోవి నెఱజాణ ఎవరో ప్రత్యేకించి చెప్పాలా? 

 rashi khanna recent photo shoot కోసం చిత్ర ఫలితం

ఆమే అజంతా చిత్రమో!
ఎల్లోరా శిల్పమో!
ఖజురహో  శృంగారమో!
హంపి కల్పతరువో!


అంటూ సౌందర్య పిపాసుల మదిలోని కవితా జలధారలను ప్రవహింపజేసే ముగ్ధమోహిని రాశీకే స్వంతం అనిపిస్తుంది కదూ!  
 

అందాలు రాశిగ పోసి ఆ రాశికి ప్రాణం పోస్తే పరిమళించే పరవశమతిశయించే దివ్యస్వరూపం రాశీ ఖన్నా అనటంలో సందేహించనేల!
 

టాలీవుడ్ లో ప్రవేశించి, ఐదారేళ్లుగా ఎదురులేని కెరీర్ ని కొనసాగిస్తోంది ఈ గులాబిబాల. బాక్సాఫీస్ – హిట్స్ ఫట్స్ తో సంబంధం లేకుండా ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఎలాంటి సరిహద్దులు లేకుండా దూసుకుపోతోది.
rashi khanna recent photo shoot కోసం చిత్ర ఫలితం 
ఇటీవల శ్రీనివాస కళ్యాణం ఫట్ అయినా, తొలి ప్రేమ ఇచ్చిన హిట్ తో విజయ సోఫానాలపై చెంగు చెంగున ఎగురుతూ  ముందుకు సాగుతున్న రాశీ ప్రస్తుతం తమిళంలో కుర్ర హీరోల సరసన వరుస  అవకాశాలు అందుకుంటుంది.
 

గత సంవత్సరం అదర్వ సరసన ‘ఇమైక్క నోడిగల్’ జయం రవి సరసన ‘అడంగ మారు’ అనే థ్రిల్లర్ లో మెరిసింది. ప్రస్తుతం విశాల్ సరసన ‘అయోగ్య’ తో పాటుగా ‘సైతాన్ కా బచ్చా’ అనే హారర్ మూవీలో నటిస్తూ ఉందీ ఈ బిజీ-బీ గా ఉంది.
 rashi khanna recent photo shoot కోసం చిత్ర ఫలితం
వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ బొద్దు గుమ్మ అక్కడ కుర్రకారుకు కంటిపై కునుకు పట్టనివ్వడం లేదట. అందుకే ప్రఖ్యాత ‘చెన్నయ్ టైమ్స్’ తన టాప్ 30 మోస్ట్ డిజైరబుల్ బ్యూటీస్ లో రాశీ కి చోటిచ్చింది. ఇంతటి ఘనత అందుకున్న సందర్భంగా రాశీ వరుసగా సామాజిక మాధ్యమాల్లో అదిరిపోయే ఫోటో-షూట్లను షేర్ చేస్తూ తెలుగు సిని-బాషా అభిమానులకు కూడా అందుబాటులో ఉంటోంది.
 Raashi Khanna4

మరింత సమాచారం తెలుసుకోండి: