ఈ మద్య టాలీవుడ్, కోలీవుడ్ లో యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  గతంలో తమిళ సినిమాలకు సంగీతం అందించిన అనిరుథ్ ఆ మద్య త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’సినిమాకు సంగీతం అందించాడు.  తాజాగా మరో ఆసక్తికర సినిమాకి బాణీలు అందించనున్నాడు. హరీశ్‌రామ్‌ ఎల్‌హెచ్‌ దర్శకత్వంలో ‘తుంబా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ ప్రమోషనల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఇక తమ సినిమాలు ముహూర్తం మొదలైనప్పటి నుంచి రక రకాలుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు చిత్ర యూనిట్.  తమ సినిమాను ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళితే అంత భారీగా ఓపెనింగ్స్ వస్తాయని ఫిలింమేకర్స్ భావిస్తున్నారు. అందుకే ప్రమోషనల్ ఈవెంట్లను వినూత్నంగా ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.  తాజాగా  ఓ ఫన్నీ స్కిట్ రూపంలో ఈ వీడియో డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచందర్ తన నివాసంలో వీడియో గేమ్ ఆడుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది.
Image result for Thumbaa movie
ఆ కాల్ చేసింది దర్శకుడు హరీష్ రామ్. ఓ సన్నివేశానికి ట్యూన్‌ కూడా కావాలని అనిరుధ్‌ను కోరతాడు దర్శకుడు కోరతాడు. హీరో ఎవరు అని అనిరుథ్ అడగగా..టైగర్ అంటాడు. రాజమౌళిగారు ఈగను పెట్టి తీస్తే, మీరు పులిని పెట్టి తీస్తున్నారా  అంటూ దర్శకుడిని సన్నివేశం వివరించమనగా, ‘పులిని పరిచయం చేసే సీన్‌.. అది హాల్‌ కనిపించగానే జనం ఒకటే గోల’ అని హరీశ్‌రామ్‌ చెబితే, అయితే పులికి సంబంధించిన ప్యూజువల్స్ పంపండి ఫీల్ అయి చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు.

మళ్లీ తన వీడియో గేమ్ ఆడడంలో నిమగ్నమవుతాడు అనిరుధ్. ఇంతలో ఇంట్లోకి ఓ పెద్దపులి ఠీవీగా అడుగులేసుకుంటూ ప్రవేశిస్తుంది.  పులిని చూసి అనిరుధ్ బిక్కచచ్చిపోతాడు. వెంటనే ఫోన్ అందుకుని ఓరి దుర్మార్గులారా... సీన్ పంపండి అంటే నిజం పులినే పంపుతారా! అంటూ పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత పులి పక్కనే కూర్చుని తన ఇంట్రడక్షన్ సీన్ బీజీఎంను తానే చేయించుకుంటుంది.   ఈ సినిమా కథ ఏంటి? పాత్రధారులు ఎవరు? తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. రీగల్‌ రీల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై సురేఖ న్యాపతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: