ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందు కు వచ్చింది. అయితే మహానాయకుడు లో బాలయ్య నటించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు హత్తుకుంటాయి. నటన పరంగా బాలకృష్ణకి ఈసారి యంగ్‌గా కనిపించాల్సిన అవసరం పడలేదు కనుక 'కథానాయకుడు' చివర్లో వున్న కంఫర్ట్‌ కంటిన్యూ అయింది. రాజకీయ పరంగా ఆవేశాన్ని అణచిపెట్టాల్సిన చోట, నమ్మకద్రోహాలని మౌనంగా భరించాల్సిన సందర్భంలో, భార్య కోసం తపించే భర్తగా భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో బాలయ్య నటన చాలా మెప్పిస్తుంది. ఈ సన్నివేశాలు సినిమా కు ప్రధానంగా చెప్పుకోవచ్చు. 

Image result for ntr mahanayakudu

విద్యాబాలన్‌ తన పాత్రకి ప్రాణం పోసింది. తన 'బావ' ప్రజా నాయకుడిగా, ప్రజల మధ్య స్త్రీలకి సమాన హక్కులు ఇస్తానని మాట ఇస్తున్నపుడు ఆమె కళ్లల్లో ఆనందం, అతని పట్ల వున్న ఆరాధన చూసి తీరాల్సిందే. నారా చంద్రబాబు బాడీ లాంగ్వేజ్‌ని, మాట తీరుని కాస్త అనుకరిస్తూ రానా దగ్గుబాటి మెప్పించే ప్రదర్శన ఇచ్చాడు. నాదెండ్ల భాస్కరరావు పాత్రని సచిన్‌ ఖేడేకర్‌ సహజంగా పోషించాడు. హరికృష్ణగా కళ్యాణ్‌రామ్‌కి అడపాదడపా ఆవేశపడడం మినహా ఎక్కువ స్కోప్‌ దక్కలేదు. 

Image result for ntr mahanayakudu

ఎన్టీఆర్‌ బయోపిక్‌ అనగానే గుర్తుండే లేదా గుర్తు చేసుకుని ప్లే చేసుకునే పాటలని కీరవాణి ఇవ్వలేదు. సన్నివేశ బలం లేక నేపథ్య సంగీతానికి కూడా స్కోప్‌ దొరకలేదు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణల్లో కూడా మొదటి భాగంలో వున్నంత కమాండ్‌ వినిపించలేదు. ఛాయాగ్రహణం, కళ, నిర్మాణ విలువలు అన్నీ చక్కగా కుదిరాయి. దర్శకుడిగా క్రిష్‌కి మొదటి భాగంలో వున్న భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛ లేకపోవడం, ఈ చిత్రం ఎలా వుంటాలనే దానిపై 'పర్యవేక్షణ' జరగడం వల్ల క్రిష్‌ క్రియేటివిటీ, డైరెక్షన్‌ కేపబులిటీ అక్కడక్కడా మాత్రమే మెరిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: