దర్శకుడు వంశీ పైడిపల్లి తీరు మారకపోవడంతో ‘మహేహర్షి’ తలనోప్పులతో మహేష్ తీవ్ర టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. దీనితో ఈమూవీ విడుదల విషయంలో మళ్ళీ మార్పులు వస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి. తను తీసే సినిమాలకు సంబంధించి రీషూట్లు వాయిదాలకు చిరునామాగా కొనసాగే వంశీ పైడిపల్లి ‘మహర్షి’  మూవీ విషయమై అనుసరిస్తున్న వ్యూహాలు కనీసం ఆ దర్శకుడుకి అయినా అర్ధం అవుతున్నాయా అన్న విషయమై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

వాస్తవానికి ఈ సినిమాను ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 5న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే అది కుదరక ఏప్రిల్ 25కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఈ డేట్ కు కూడ ఈమూవీ విడుదల అవ్వడం కష్టం అన్న లీకులు ఈమూవీ యూనిట్ వర్గాల నుండి బయ్యర్లకు అందుతున్నట్లు టాక్. 
ప్రతిష్టాత్మక చిత్రం... అదిరిపోయే లుక్
దీనికి కారణం ఈమూవీకి సంబంధించిన ఇంకా చాల వర్క్ పెండింగ్ లో ఉండటంతో ఈమూవీని ఏప్రియల్ నుండి జూన్ కు విడుదల వాయిదా వేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో సమ్మర్ హడావిడి అంతా పూర్తి అయిపోయాక జూన్ నెలలో ‘మహర్షి’ విడుదల అయితే ప్రయోజనం ఏమిటి అని మహేష్ మధన పడుతున్నట్లు టాక్. 
A still from Maharshi teaser, featuring Mahesh Babu. YouTube screengrab
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ చిత్రీకరణ విషయంలో దర్శకుడు వంశీ పైడి పల్లికి కొన్ని సందేహాలు ఉండటంతో ఆ సీన్స్ ను మళ్ళీ షూట్ చేద్దాం అని వంశీ మహేష్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఒక్క ఫెయిల్యూర్ వచ్చినా ఆ ఫెయిల్యూర్ విపరీతమైన ప్రభావం చూపెడుతున్న నేపధ్యంలో వంశీ పైడిపల్లి సూచనకు మహేష్ ఓకె అనలేక అదేవిధంగా నో అనలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: