సినిమా రంగమంటేనే ఓ మాయాజాలం. అక్కడ అన్ని రంగులు కలసి ఉంటాయి. ఎపుడు ఏ రంగు ఎవరి మీద పడి నలుపులోకి వెళ్ళిపోతారో తెలియదు. ఓ విధంగా లక్కు ఇక్కడ కిక్కు ఇస్తుంది. అదే సూపర్ పవర్ లా పనిచేస్తుంది. టాలెంట్, హార్డ్ వర్క్ అన్నీ దాని తరువాతే. విషయానికి వస్తే తమన్నా కూడా నిన్నటి వరకూ హిట్టు కోసం నానా పాట్లూ పడిన హీరోయినే. ఆమె మూవీస్ వరసగా దెబ్బ కొట్టడం, టాప్ హీరోలు పక్కన పెట్టడంతో ఆమె ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది.


ఫలితంగా ఆమె సీనియర్ మోస్ట్ హీరో వెంకటేష్ పక్కన ఎఫ్ 2 మూవీలో జోడీ కట్టింది. మొన్న సంక్రాంతికి వచ్చిన ఆ మూవీ బంపర్ హిట్ అయింది. దాంతో సీనియర్ల పక్కన వెతుక్కుటూ తమన్నేకే చాన్సులు వస్తున్నాయట. నిన్నటి వరకూ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారికి హీరోయిన్ల ప్రాబ్లం బాగా ఉండేది. ఆప్షన్ మాత్రం నయన తార, శ్రియ మాత్రమే. ముఖ్యంగా  శ్రియా  తన సెకండ్ ఇన్నింగ్స్ అన్నీ సీనియర్లతో నటించి ముందుకు వెళ్తోంది.


ఇపుడు తమన్నా జోరు పుణ్యాన శ్రియకు పెద్ద కష్టమే వచ్చిందంటున్నారు. ఏకంగా ఓ మూవీలో ఆమెకు చాన్స్ ఇలా వచ్చి అలా పోయిందట. మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ నటిస్తున్న మూవీ వెంకీ మామతో అత్తగా మొదట శ్రియను అనుకున్నారు. ఎపుడైతే ఎఫ్ 2 మూవీని తమన్నాతో కలిపి హిట్ కొట్టాడో వెంకీ ఇపుడు తన పక్కన శ్రియను మార్చేసి యంగ్ హీరోయిన్ అంటున్నారుట. దాంతో పాయల్ రాజ్ పుత్ ని సెలెక్ట్ చేశారని టాక్.


తమన్నా  మహిమ వల్లనే శ్రియాకు ఇలా చాన్స్ పోయిందని సెటైర్లు పడుతున్నాయి. ఇకపోతే బాలయ్య, నాగ్ వంటి నటులు కూడా యంగర్ జనరేషన్ హీరోయిన్లు కావలంటున్నారుట. దాంతో శ్రియ కు సీనియర్లు కూడా హ్యాండ్ ఇచ్చేశారని అంటున్నారు. మొత్తానికి తమన్నా తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ సీనియర్ శ్రియ ఆఫర్లకు మొత్తానికి గండి కొట్టేసిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: