ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అన్న గారి సినిమా అర్దాంతరంగా ముగిసి పోయిందన్న ఫీలింగ్ చాలా మందికి కలిగింది. ఎన్టీఆర్ రెండుపార్ట్స్ నూ చూసేసినవాళ్లు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ను మూడోపార్ట్ అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్ట్స్ గా రూపొందించినా అసంపూర్ణంగా ముగించాడు బాలయ్య. ఈ నేపథ్యంలో.. ఆ తర్వాత ఏం జరిగింది? అనే చర్చ సహజంగానే  వస్తుంది.  అందుకు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను సమాధానంగా భావిస్తున్నారు జనాలు.

Image result for lakshmis ntr

తెలుగుదేశం వీరాభిమానులకో, ఒక కులం వారికో, చంద్రబాబు అభిమాన సంఘాల వారికో..  ఇక్కడి వరకూ చాలు అనిపించవచ్చు. సగటు సినీ ప్రేక్షకుడికి కావాల్సింది ఇది కాదు కదా. అందుకే.. ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్స్ తేడా కొట్టాయి.  ఇక సెకెండ్ పార్ట్ విడుదల కన్నా మునుపే  ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రుచి చూపించాడు. ‘ఆ తర్వాతి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓడిపోయాడు తెలుసా..’ అంటూ సినిమా క్లైమాక్స్ తర్వాత థియేటర్లో జనాలు చర్చించుకోవడం ఆర్జీవీ పుణ్యమే అని చెప్పవచ్చు.

Image result for lakshmis ntr

నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు వ్యవహారాన్ని సినిమాలు చూపిన నేపథ్యంలో.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాకా వచ్చిన జనరల్ ఎలక్షన్స్ లో చిత్తుగా ఓడిపోయిన వైనాన్ని తెలిసిన వాళ్లు తమ పక్క వాళ్లకు వివరించడం మొదలుపెట్టారు థియేటర్లలో. ఇక సినిమా అర్ధాంతరంగా ముగియడంతో..'ఆ  తర్వాత ఏం జరిగిందో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలి..' అని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆర్జీవీ సినిమాకు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ టూ కావాల్సినంత ప్రచారాన్నే కల్పిస్తోంది. ఇదే ఊపులో వస్తే.. ఆర్జీవీ సినిమాల్లో దేనికీ లభించనంత స్థాయి ఓపెనింగ్స్ లభించవచ్చునేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: