ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశవ్యాధితో ఆయన బాధపడుతున్నారు.హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు.  ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. వందకు పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Image result for celebs at kodi ramakrishna

మంగమ్మ గారి మనవడు, గూఢచారి నం.1, ఆహుతి, శత్రువు, తలంబ్రాలు, భారతంలో బాల చంద్రుడు, స్టేషన్ మాస్టర్, అమ్మోరు, దేవి, దేవుళ్లు, అంజి, దేవీపుత్రుడు, అరుంధతి తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని కెసిఆర్ పేర్కొన్నారు. 

Image result for celebs at kodi ramakrishna

ఫిలిం నగర్ లోని కోడిరామకృష్ణ ఇంటికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోడిరామకృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.  దర్శకుడు రామకృష్ణ కన్నుమూయడం ఎంతో బాధాకరమని బాలకృష్ణ తెలిపారు.

Image result for celebs at kodi ramakrishna

ఆయన తనతోనే ఎక్కువ సినిమాలు చేశారని బాలయ్య గుర్తు చేశారు. టాలీవుడ్ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని నటుడు అలీ ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండ్ దర్శకుడిని కోల్పోయిందని జూనియర్ ఎన్‌టిఆర్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: