అన్న నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆస్తి. ఆయన ఓ విధంగా దైవ సమానుడిగా అంతా భావిస్తారు. దేవుడు పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు. అలాంటిది తెలుగు సినీ వల్లభుడు. రాజకీయాలకు అర్ధం పరమార్ధం చెప్పిన మహానుభావుడు నందమూరి వారు. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయడమే గొప్ప విషయం. అటువంటి ఘనకీర్తి పెంచుకున్న అన్న గారిది జగమంత కుటుంబం. ఆయన కుటుంబం కూడా జగమంతే.


మరి ఆయన పేరు పెట్టుకుని ఆయన సినీ వారసత్వాన్ని మూడవ తరంలో కొనసాగిస్తూ దూకుడుగా కెరీర్ కొనసాగిస్తున్న జూనియర్ తారక రాముడు ఇప్పటివరకూ తాతగారి బయోపిక్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గత నెలలో రిలీజ్ అయిన కధానాయకుడు మూవీ విషయంలో అదే జరిగింది. టాలీవుడ్ మొత్తం స్పందించినా జూనియర్ మాత్రం పెదవి విప్పలేదు. ఇపుడు మహానాయకుడు వంతు. ఈ మూవీ నిన్న రిలీజ్ అయింది. ఇక ప్రీమియర్ షో కూడ వేసి కుటుంబాన్ని మొత్తం వెళ్ళి చూశారు. ఆ కుటుంబ సభ్యునిగా జూనియర్ మాత్రం ఎక్కడా చడీ చప్పుడు లేదు. 


దీని మీద మళ్ళీ ఆసక్తికరమైన కధ నడుస్తోంది. బాలయ్యకు జూనియర్ కి చెడిందని అందుకే కోరి మరీ జూనియర్ ఇలా గాయబ్ అవుతున్నారని అంటున్నారు. కధానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెరిసి తాత గారి సినిమా బాబాయ్ తీయడం గర్వకారణమని, తన పిల్లలకు కూడా ఈ మూవీ చూపిస్తానని చెప్పిన జూనియర్ ఇపుడు తానే మూవీ చూడడానికి రాకపోవడేమేంటి అన్న చర్చ జరుగుతోంది. ఎంతైనా తాత కదా విభేదాలు ఎన్ని ఉన్నా జూనియర్ వచ్చి మూవీ చూడాల్సిందని, కనీసం మూవీ గురించి ట్వీట్ అయినా చేస్తే బాగుండేదని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం జూనియర్ వూర్లోనే ఉన్నాడు. అయినా చడీ చప్పుడు లేకుండా ఉన్నాడు. మరేంటో...


మరింత సమాచారం తెలుసుకోండి: