నిర్మాతగా పంపిణి దారుడుగా మంచి ఆనుభవం ఉన్న దిల్ రాజు ఒక మూవీ కధను విన్నవెంటనే ఆ మూవీ జయాపజయాలు అంచనా వేయడంలో దిట్ట. అందుకే అతడు ఒక సినిమా కొన్నాడు అంటే అందరు ఆసినిమాలో ఎదో ఒక స్పెషాలిటీ ఉండి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతుంది. 
Nandamuri Kalyan Ram with brother Jr NTR
ఈ నేపధ్యంలో సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వం వహించిన కళ్యాణ్ రామ్ ’118’ దిల్ రాజ్ కొనడం వెనుక జూనియర్ ఒత్తిడి ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ‘పటాస్’ మూవీ తరువాత కళ్యాణ్ రామ్ కు ఒక్క హిట్ కూడ లేకపోవడంతో కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ కూడ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.
Kalyan Ram with Jr NTR
యంగ్ హీరోల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో సినిమాలకు హిట్స్ లేకుండా కొనసాగడం కష్టం కాబట్టి దిల్ రాజ్ గోల్డెన్ హ్యాండ్ టచ్ కోసం ‘118’ ను దిల్ రాజ్ చేత జూనియర్  బలవంత పెట్టి మరీ కొనిపించినట్లు టాక్. వచ్చే వారం విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడమే కాకుండా ఈమూవీలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ కు కూడ మంచి స్పందన వస్తోంది.  
ఎన్టీఆర్ వాచ్ సీక్రెట్ పై కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు !
నివేథా థామస్ షాలినీ పాండే నటించిన ఈ థ్రిల్లర్ మూవీతో సమ్మర్ రేస్ మొదలు కాబోతోంది. ఈసినిమాను దిల్ రాజ్ కేవలం నైజాం ఏరియాకు మాత్రమే కాకుండా ఆంధ్ర సీడెడ్ ప్రాంతాలను కలిపి 7 కోట్లకు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ రేంజ్ మూవీకి ఇది చాలామంచి బిజినెస్ ఆఫర్ అని అంటున్నారు. అంతేకాదు ఈమూవీ విషయంలో దిల్ రాజ్ కు నష్టాలు వస్తే తాను మరొక విధంగా ఆడుకుంటాను అంటూ జూనియర్ ఇచ్చిన భరోసాతో దిల్ రాజ్ ఈ సాహసం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావుడి చేస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: