ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి పార్ట్ పరాజయం కావటం తో రెండో పార్ట్ మీద చిత్ర యూనిట్ చాలా అంచనాలను పెట్టుకున్నది అయితే 'ఎన్టీఆర్‌ - మహానాయకుడు'లో ఎన్టీఆర్‌ ఘనత కంటే చంద్రబాబు భజన ఎక్కువయింది. 1983లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్‌ పార్టీని నడిపించలేకపోయాడని, పార్టీ దాదాపు కాంగ్రెస్‌ హస్తాలలోకి పోయే పరిస్థితి వస్తే, చంద్రబాబు యాక్షన్‌లోకి దిగి పార్టీని కాపాడాడని నమ్మించేలా ఈ చిత్రం తీసారు.


ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్

ఎన్టీఆర్‌ని మహానాయకుడు అని పేర్కొంటూ, ఆయన రాజకీయ జీవితం కోసం ఒక సినిమానే కేటాయించిన క్రిష్‌, బాలకృష్ణ... ఆయన రాజకీయ జీవితంలో మూడేళ్లకి మించి చూపించలేకపోయారు. ఈ మూడేళ్లలో కూడా ఎన్టీఆర్‌ పార్టీని నడిపించడంలో తడబడినట్టు, ఒకానొక దశలో పార్టీ వేరొకరి హస్తాల్లోకి పోయినట్టు, అప్పుడు చంద్రబాబు తన రాజకీయ పరిజ్ఞానంతో పరిస్థితిని చక్కదిద్దినట్టు చూపించారు.


ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్

ఎన్టీఆర్‌ బయోపిక్‌ చూసిన తర్వాత ఆయనపై అభిమానం పెరగడం మాట అటుంచి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఈతరం టీడీపి అభిమానులకి చంద్రబాబు గొప్పతనం తెలిసేలా చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, తద్వారా ఆయన మానసిక క్షోభకి గురవడానికి కారకుడైన వాడిగా చంద్రబాబుని విపక్షాలు చిత్రీకరిస్తూ వుంటాయి. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలా ఈ చిత్రం అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: