కోడి రామకృష్ణ.. తెలుగులో వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన నలుగురిలో ఈయన ఒకరు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొదలుకుని తాజాగా నాగాభరణం వరకు ఆయన వందకుపైగా సినిమాలను రూపొందించారు. విజయవంతమైన దర్శకుడిగా పేరు గడించారు.

కానీ కోడి రామకృష్ణ పేరు చెప్పగానే తలకు కట్టుతో ఉన్న రూపమే మనకు గుర్తొస్తుంది. తలకు ఆ బ్యాండ్ లేకుండా ఆయన్ను ఊహించుకోలేం. ఖాకీ డ్రస్సులేని పోలీసు ఎలాగో తలకు బ్యాండ్ లేని కోడి రామకృష్ణ అలాగ. కానీ ఆ బ్యాండ్ వెనుక కథ ఏంటి.. అసలు ఎందుకు ఆయన బ్యాండ్ కట్టుకుంటారు..

kodi ramakrishna HD కోసం చిత్ర ఫలితం


దీనికో కథ ఉంది. ఆయన తన రెండో సినిమా చెన్నైలో షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడికి ఎన్టీఆర్ కాస్ట్యూమర్ వచ్చారట. ఆయన పేరు కూడా రామారావే. నీ నుదురు విశాలంగా ఉంది.. ఎండ బాగా తగులుతుంది ఈ రుమాలు కట్టుకో అని ఇచ్చారట.

ఆ తర్వాత రోజు మళ్లీ ఆయనే దాన్ని ఓ బ్యాండ్ లాగా తయారు చేసి తెచ్చి ఇచ్చారట. నీకు ఈ బ్యాండ్ బావుంది.. ఎప్పుడూ తీయొద్దు అని సలహా ఇచ్చారట. అలా అప్పటి నుంచి కోడి రామకృష్ణకు ఆ బ్యాండ్ ఓ సెంటిమెంట్ గా మారింది. అదీ కోడి రామకృష్ణ తలకట్టు వెనుక కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: