తండ్రి మరణానికి కారణమైన వాళ్ళలో ఒకడైన నందమూరి బాలకృష్ణ ఆ తండ్రి పాత్రలో జీవించినా నందమూరి తారక రామా రావు నిజమైన అభిమానులు (తెలుగుదేశం కార్యకర్తలు కాదు సుమా) బాలకృష్ణను హృదయ పూర్వకంగా స్వాగతించలేరు అనేది నిస్సందేహం. ఎన్టీఆర్ నటజీవితంలో పెద్ద మలుపులులేవు సాఫీగా విలాసవంతంగా కొనసాగిన జీవితమది. "తెరచిన పుస్తకం" లాగా  అందరికీ తెలిసిన తారకరామచరితే! ఒక మనిషి కృషితో ఎదిగే తీరును, అన్నింటా విజయసోఫానాలపై, నల్లేరు మీద నడకలాగా ఎన్టీఆర్ కథానాయకుడు ఉండాలి.

సంబంధిత చిత్రం

ఒక సుఖ ప్రయాణంలా సాగినా, మలుపులు లేని జీవితం చూపించి ఉంటేనైనా చాలా బాగుండేది. అలా కాకుండా ఎన్టీఆర్ కథానాయకుడు లో మనిషిని మహనీయుడు ఆపై భగవంతునిగా చిత్రీకరించటానికి  చేసిన విఫలయత్నం - ఎన్ టీఆర్ మహానాయకుడు సినిమా విజయం పై ఆది లోనే తీవ్రప్రభావం చూపింది.


ఇక సింపుల్గా చెప్పాలంటే ఒకరి  జీవనచిత్రంలో మరొకణ్ని కధానాయకుణ్ణి చేసి కీలక పాత్ర లోని ఔచిత్యాన్ని చంపేశారు అనే కంటే - ఈసారి దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ ఆత్మకు వెన్నుపోటు పొడిచారని చెప్పొచ్చు.

ntr kathanayakuDu mahanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

జీవనచిత్రాన్ని సజీవంగా సత్యానికి ప్రతిబింబంలాగా చూపించటానికి బదులు అబద్ధాలకుప్ప చేసేశారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ మాత్రమే హీరో కావాలి.  అంతకు మించి వేరెవరూ కథానాయకులు కారాదు. అదే జరిగితే కీలక పాత్రను హత్యచేసినట్లే.  అదే జరగ్గా- ఎన్టీఆర్ కథలో చంద్రబాబు హీరోగా కీలక పాత్రగా చూపటం పూర్తిగా అనౌచిత్యం. అయినా ఎవరికి తెలియనిది ఎన్ టీఆర్ జీవిత చరిత్ర. అలాగే చంద్రబాబు రాజకీయ చరిత్ర. చంద్రబాబు సమర్ధుడైన నాయకుడే కావచ్చు కాని ఎన్టీఆర్ జీవితంలో  "జామాతః దశమ గ్రహః" అన్నదానికి సరిగా సరిపొయే లెజెండరీ విలన్ అని చెప్పటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.     


ఎన్టీఆర్ జీవితకథ అంటే అందరికీ తెలిసి జరిగినకథ. అందరికి తెలిసిన కథను సినిమాగా తీయడం కత్తి మీద సాము లాంటిది. జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఎన్టిఆర్ కథానాయకుడు ధారుణ వైఫల్యంకాగా,  మహానాయకుడు చాలా నమ్మకంతో తీసినా-దాన్ని దారి మళ్లించటం హృదయవిదారకం. ఒకరి జీవితకథలో మరోకరు హీరో కావటమంటే-కీలక పాత్ర చంపేసి ఆ దేహంలోకి మరొకరి ఆత్మను ప్రవేశ పెట్టి  పరకాయ ప్రవ్రేశం చేయటమే-ఆయన ఆత్మను కూడా నిర్ధాక్షిణ్యంగా చంపేయటమే! అది బ్రతికి ఉన్న మనిషి నైతే శీలాపహరణం అనవచ్చు. ఎన్టీఆర్ స్వర్గస్తులైనందున ఆత్మాపహరణం అందాం!  

సంబంధిత చిత్రం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఒక సామాన్యుణ్ణి మహోన్నతుణ్నే కాదు,  దైవంగా చూపి తప్పు చేసి వైఫల్యంతో అవమానం, తీరని ఆర్ధిక నష్టంపోగు చేసుకున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు కథలో,  కీలక కథానాయకుని పాత్రను వదిలేసి ఆయన జీవితంలో చంద్రబాబును కథానాయకుని చేయటంతో ఈ సినిమా ధారుణ వైఫల్యం చవి చూడటం తధ్యం. ప్రజలు ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు


అయితే మహానాయకుడు సినిమాలో అప్రధాన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సినిమాలో ఎన్టిఆర్ కు బదులుగా ఆయన అల్లుడు చంద్రబాబుని హీరోగా చేసి  నాదెండ్ల భాస్కరరావు "వెన్నుపోటు" ఎపిసోడ్ ని హైలైట్ చేసి - తర్వాత ఎన్టిఆర్ మళ్లీ గెలిచేందుకు చంద్రబాబు నిరంతరం తీవ్రశ్రమకోడ్చి తిరిగి ఎన్టిఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కించినట్లు చూపించారు. అసలు నిజం తెలియని దెవరికి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపిన ఎస్సి-బిసి అనే రెండు విషయాలు బహుముఖ ప్రచారంలో ఉండేవి. అందులో ఎస్సి అంటే సేం-కాష్ట్ అని, బిసి అంటే బాబు కాండిడేట్ అని అర్ధం.

ntr kathanayakuDu mahanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

అంటే సమాజ, ఆర్ధిక, కుల వాద దోపిడీకి చంద్రబాబు టిడిపి ప్రవేశమే తెర తీసిందని చెప్పొచ్చు. ఇలా జీవిత కథకు సంబంధంలేని విషయాలను కథ లోకి చేర్చి సినిమా ఆత్మను చంపేస్తే - అసలు కథ తెలిసిన వారింకా బ్రతికే ఉండటంతో, అనేక నిజాలు కుప్పలు తెప్పలుగా బయటకు వస్తాయి. బహుశ ఈ సినిమా తొలి దర్శకుడు తేజ ఈ సినిమాపై బాహ్య వత్తిడుల ను తట్టుకోవటం ఇష్టంలేకే తప్పుకొని ఉంటాడని జనం నమ్ముతున్నారు. 


దీంతో జామాతగారు ఎన్టీఆర్ ఆస్తులు, పదవి, చివరకు జీవితంతో పాటు, ఈ సినిమాతో ఆయన ఆత్మను కూడా కబ్జా చేయటాని కి ప్రయత్నించారని చెప్పవచ్చు. జనానికి ఎన్టీఆర్ సంపూర్ణంగా తెలియటం వలన ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు చేసినా నిష్ప్రయోజనమే!  ఎన్టీఆర్  జీవితాంతం ద్వేషించి, తెలుగు దేశం పార్టీ జన్మకు కారణమైన ఆగర్భశత్రువు కాంగ్రెస్ తో ఇప్పుడు చంద్రబాబు మైత్రి నెరపటం అంతర్లీనంగా తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది.  అదే చంద్రబాబును ఈ కథలో కీలకంగా చూపటం దెబ్బే. బసవతారకం మరణంతో మహానాయకుడు ముగుస్తుంది. ఎన్టిఆర్ రియ-లైఫ్-విలన్ అయిన చంద్ర బాబు గురించి అందరికి తెలుసు. అలాంటిది మహానాయకుడులో చంద్రబాబుని హీరోని చేశాడు దర్శకుడుఈ సినిమాకు గోరంతను కొండంతగా ప్రచారం చేస్తున్న సామాజికవర్గ మీడియా కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది.   


మహానాయకుడులో ఎన్టిఆర్ సాధించిన సామాజిక లక్ష్యాలు, నిరుపేదలకు ఆయన అందించిన ప్రయోజనాలు ఎన్ని ఉన్నా ఆయన చేసిన తప్పుడు నిర్ణయాలతో ఇప్పుడు జాతి అనుభవించే కష్టాలు మరువరానివి. నాటి ప్రముఖ పాత్రికేయుడు గజ్జెల మల్లారెడ్ది అధములలో ప్రధముడు అంటూ ఎన్టీఆర్ గురించి రాసిన వ్యాసం చూస్తే ఆయన లోని మూర్ఖత్వం అందరికి తెలుస్తుంది. అలాంటి నెగేటివ్స్ కొన్నైనా చూపించి ఉంటే జీవితం మంచి చెడుల సంగమం అన్న సత్యం చూపించినట్లు ఉండేది.  


అసలు యన్‌టిఆర్‌ బయోపిక్ లో ఏముండాలి

 * పూల పాన్పులా సాగిన ఎన్ టీఆర్ సినీ జీవితం

 * రాజకీయ అరంగేట్రం

 * సాధించిన అనితర సాధ్యమైన విజయం

 * నాదేండ్ల వ్యవహారం నేడు వెన్నుపోటు అనబడుతున్న వ్యూహం

 * మళ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం

 * ఎన్టీఆర్‌ జీవితం లో  లక్ష్మీ పార్వతి ప్రవేశం

 * ఎన్నికల్లో మళ్ళా ప్రభంజనం

 * ఆపై అధికారం చేజిక్కించుకోవటానికి జామాత - కుటుంబ, రాజకీయసభ్యుల్ని సాధనాలుగా చేసి కుతంత్రంతో యన్‌టిఆర్‌ కు వేసిన అసలు సిసలు వెన్నుపోటు

 * ఇక చివరి క్షణాల్లో ఎన్టీఆర్‌ క్షోభపడటం - హృదయవిధారకం గా ఆయన స్వర్గస్తులు కావడం


జగమెరిగిన ఎన్టిఆర్ చరిత్రలో ఆయన సర్వనాశనానికి కారణమైన చంద్రబాబును పోసిటివ్ గా హైలైట్ చేసి చూపడంతో మహానాయకుడు వైఫల్యం సంపూర్ణంగా చెప్పొచ్చు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు & తెలుగుదేశం విజయంకోసం ఎన్టీఆర్ ఆత్మను చంపిన వైనం తప్ప వేరేమీ గాదు. 


బయోపిక్ అంటే సత్యం, యధార్ధం చూపించాలి. కాని ఆయన తప్పులే కాదు ఆయనపై జరిగిన కుట్రలు కుతంత్రాలను యధార్ధ సంఘటనలు మరుగుపరచి తీసిన జీవితచిత్రం క్రిష్-బాలకృష్ణ లకు మాత్రమే సాధ్యం. ఇక్కడ బయోపిక్ సీరిస్ ద్వారా ఎన్టీఆర్ జీవితం లోని శీలహననం పూర్తయింది. అసలు ఎన్టీఆర్ చరమాకం చూప ని బయోపిక్ ఒక బయోపికేనా?   'నో మాన్ ఈజ్ యాన్ ఐలెండ్'  అనే జీవిత సత్యాన్ని మరచిపోయిన సినిమాలు ఈ క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్స్ 


అయితే ఎన్టీఆర్ మహానాయకుడు-రాం గోపాల్ వర్మ సినిమా  "లక్ష్మిస్ ఎన్ టీఆర్" ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ విజయా లకు రాజమార్గం తెరిచినట్లే! అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రచారచిత్రమా!

ntr kathanayakuDu mahanayakuDu lakshmi's ntr కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: