కోడి రామకృష్ణతో తమ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఒకొక్క సెలెబ్రెటీ ఒకొక్క విధంగా స్పందిస్తున్నారు. ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని అంతా షేక్ చేసిన విషాదకర సంఘటన రామకృష్ణ మరణం మాత్రమే. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టైలిష్ విలనిజాన్ని క్రియేట్ చేసిన మొట్టమొదటి దర్శకుడు కోడి రామకృష్ణ. 
కోడిరామ‌కృష్ణ‌గారిని కోల్పోవ‌డం తీరని లోటు
ఈయన ఆ కాలంలోని అందరి హీరోలతో సినిమాలు తీసినా రాజశేఖర్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మార్చడంలో ఈయన పాత్ర అద్వితీయం. ‘అంకుశం’ ‘తలంబ్రాలు’ సినిమాలు తరువాత రాజశేఖర్ కెరియర్ గ్రాఫ్ ఊహించని స్థాయిలోకి ఎదిగిపోయింది. నిన్న రాజశేఖర్ కోడి రామకృష్ణ మరణం పై స్పందిస్తూ ‘తలంబ్రాలు’ సినిమా వల్ల తాను పడ్డ టార్చర్ ను ఆసక్తికరంగా వివరించాడు. 
అధునాతన పద్దతులతో...
‘తలంబ్రాలు’ విడుదలై సూపర్ హిట్ సాధించిన తరువాత తాను బయటకు రావడానికి కూడ భయపడిన విషయాలను వివరించాడు. ఈమూవీలో తన నెగిటివ్ పాత్ర ఇమేజ్ తో బయటకు తాను వస్తే చాలు ఆకాలం నాటి అమ్మాయిలు తన వంక చాల అసహ్యంగా చూస్తూ చూసే చూపులను తట్టుకోలేక కొద్దిరోజులపాటు తాను బయటకు రావడం మానేసాను అంటూ ‘తలంబ్రాలు’ మూవీ వల్ల తాను పడ్డ పాటలను వివరించాడు. 

వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చినా వీరిద్దరూ కలిసి పనిచేసిన ‘ఆగ్రహం’ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్ కు బ్రేక్ పడినా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా అందరి హీరోలతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ అందరి వాడిగా కోడి రామకృష్ణ తెచ్చుకున్న మంచి పేరు వల్ల ఈరోజు ఇండస్ట్రీ అంతా తమ ఇంటి సభ్యుడు దూరం అయినట్లుగా భావోద్వేగానికి లోనవుతూ ఈయనతో తమకు గల సాన్ని హిత్యాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: