హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి అక్కడ విద్యార్ధులతో తన భావాలను పంచుకున్న రాజమౌళి మళ్ళీ భాగ్యనగరం తిరిగి వచ్చాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల విషయాల నుండి రాజకీయాల వరకు ఎన్నో విషయాల పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
అవన్నీ సినిమా తీసేపుడు ఆలోచించడం కుదరదు
తాను అప్పట్లో బుల్లితెర కోసం ‘శాంతినివాసం’ సీరియల్ తీసినప్పుడు తాను ఈ స్థాయికి వస్తానని తాను కలలో కూడ అనుకోలేదని అయితే చేసే ప్రతి పనిలోనూ బెస్ట్ ఎఫర్ట్ పెడితే ఎవరైనా విజయం సాధించవచ్చు అని అభిప్రాయ పడుతున్నాడు రాజమౌళి. ఇప్పటికీ తాను దర్శకుడుగా సాధించిన విజయాలకు గ్రేట్ అనుకోవడం లేదనీ అయితే తన కెరియర్ బిగినింగ్ తో పోల్చుకుంటే ప్రస్తుతం తాను ఉన్నత స్థాయిలో ఉన్న విషయాన్ని అంగీకరిస్తాను అంటూ ఆస్కతికర కామెంట్స్ చేసాడు.
అలాంటి వాటి వల్ల నిర్మాతలకు లాభమే
ఇదే సందర్భంలో ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న వ్యక్తి రాజమౌళి నుంచి అంతర్జాతీయస్థాయిలో ఉండే మూవీ ఎప్పుడు వస్తుంది ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తీసే సినిమాను బాగా తీస్తే ఏసినిమా అయినా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందనీ దీనికి ఎటువంటి ప్రత్యేక కొలమానాలు లేవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో రాజమౌళి నేటి రాజకీయ నాయకుల విలువల పతనానికి కారణం ప్రజలు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
కీరవాణి మాత్రమే ఎందుకంటే...
మొదట్లో తాను జయప్రకాష్ నారాయణ్ ను లోక్ సత్తాలో సభ్యుడుగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు అంతా చెడ్డవారు అనీ ప్రజలు అంతా మంచివారు అనీ భావించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే జనం డబ్బు పుచ్చుకుని ఓట్లు వేసిన సంఘటనలు తాను చూసిన తరువాత రాజకీయ నాయకులలో విలువల పతనానికి ఒక విధంగా ప్రజలు కూడ బాధ్యులు అన్న విషయం తనకు స్పష్టంగా అర్ధం అయింది అంటూ రాజమౌళి నేటి పరిస్థుతులకు ప్రజలు కూడ బాధ్యులే అంటున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: