తండ్రి గొప్పదనాన్ని చాటే కొడుకులు చాలా మంది ఉంటారు. కానీ తండ్రి గొప్పదనాన్ని పలుచన చేసేవారు అతి కొద్ది మందే ఉంటారు. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాతో బాలకృష్ణ ఆ పనే చేశాడని నందమూరి తారక రామారావు నిజమైన అభిమానులు ఫీలవుతున్నారు.



బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని ప్రకటించినప్పుడు ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషించారు. ఇన్నాళ్లకు తమ నాయకుడి జీవితాన్ని తెరపై చూసుకునే అదృష్టం వచ్చిందని మురిసిపోయారు. కానీ ఇప్పుడు విడుదలైన మహానాయకుడు చూశాక వారి ఆశలు అడియాసలయ్యాయి.



ఎన్టీఆర్ ను గొప్పగా చూపించకపోయినా ఫరవాలేదు. కానీ ఎన్టీఆర్‌ గొప్పదనాన్ని తగ్గించేలా మహానాయకుడు సినిమా ఉందని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. ఎన్టీఆర్ అడుగడుగునా చంద్రబాబుపై ఆధారపడ్డాడని.. చంద్రబాబు లేకుండా ఎన్టీఆర్ లేరనే విధంగా ఈ చిత్రాన్ని మలిచిన తీరు వారిని క్షోభపెడుతోంది.



ఎన్టీఆర్ ను జీవిత చరమాంకంలో దారుణంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును.. ఈ సినిమాలా ఆకాశానికెత్తేయడం వారికి ఏమాత్రం రుచించడం లేదు. గతంలో చంద్రబాబు ఎన్టీఆర్‌ను బతికి ఉండగా వెన్నుపోటు పొడిస్తే.. బాలయ్య చనిపోయాక కూడా ఆయన్ను వెన్నుపోటు పొడిచాడని బాధపడుతున్నారు. మహా నాయకుడు ద్వారా బాలయ్య ఎన్టీఆర్ కు నివాళి అర్పించకపోగా.. ఆయన ప్రతిష్టను పలుచన చేసారని బాధపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: