నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో భాగం నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ధారుణంగా నిరాశ పరుస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ఈ సినిమా వసూళ్ళు దారుణంగానే కాదు అవమానకరంగా కూడా ఉన్నాయి మహానాయకుడు ప్రీమియర్‌-షోస్‌ తో కేవలం ఒక లక్షా పద్నాలుగు వందల అరవై డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్‌-అనలిస్ట్‌ జీవీ వెల్లడించారు. 


జనవరిలో విడుదలైన కథానాయకుడు ప్రీమియర్‌-షోస్‌ కు నాలుగు లక్షలకుపైగా వసూళ్లు వచ్చాయి. కథానాయకుడు ఫలితాల ప్రభావంతోపాటు ఎన్టీఆర్ రాజకీయ జీవితం లోని సంఘటనలను నిష్పాక్షికంగా చూపించే ధైర్యం యన్‌టిఆర్‌-సీరిస్ నిర్మించిన బృందానికి లేదన్న అభిప్రాయానికి విశ్వవ్యాప్తంగా తెలుగుప్రేక్షకులు ముందే వచ్చేయటంతో మహానాయకుడు వసూళ్ళు ఇంత ధారుణంగా పడిపోయాయి. 

Ntr Mahanayakudu First Day Collections - Sakshi
మహానాయకుడు సినిమాకు మొదటిరోజు కేవలం ₹65లక్షల రూపాయలు మాత్రమే వసూళ్ళు  వచ్చాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో కలిపి కనీసం కోటి రూపాయలు వసూళ్ళు కూడా రాబట్టలేక పోవడం అవమానం. 

అంటే దీనర్థం, మహానాయకుడు సినిమాను నందమూరి అభిమానులు కూడా చాలాతేలికగా తీసుకున్నారన్నమాట. 

mahanayakuDu collections కోసం చిత్ర ఫలితం
ఉభయ రాష్ట్రాల్లోనూ ప్రాంతం తేడా లేకుండా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఊహించిన‌ట్లుగానే ఎన్టీఆర్మ‌హానాయ‌కుడు సినిమా బాక్సా-ఫీస్ ద‌గ్గ‌ర దారుణ మైన ఓపినింగ్స్ తో మొదలైంది. గతంలో బాల‌య్య నటించిన ఏ సినిమాకు - అలాగే కృష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాకు కూడా ఇంత విషాధకర ఓపినింగ్స్ రాలేదు.  అంతెందుకు ఈచిత్రం మొదటిభాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వసూళ్ళలో సగం కూడా రాని దిగ‌జారిపోయిన పరిస్థితి.  



విభిన్న ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేవలం కోటి రూపాయలు (ఇది కేవలం అంచనా మాత్రమే) లోపుగానే తొలి రోజు వచ్చినట్లు తెలుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ సినిమా విడుదల రోజు అతి తక్కువ వసూళ్ళు సాధించిన చరిత్రను మహానాయకుడు చెరిపేసి బ్రద్దలు కొట్టిందంటున్నారు. 



ఆర్టిసి క్రాస్ రోడ్ లో మహానాయకుడు చిత్రం మొదటిరోజు ₹160641/- గ్రాస్ వస్తే, అదే రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ అక్కడ ₹344718/- గ్రాస్ వసూళ్ళు వచ్చింది. ఆఫీసర్ గ్రాస్ లో సగంకూడా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్ట్ చేయకపోవటం ఆ స్వర్గీయ నటుని గౌరవానికే తీరనిద్రోహం అనిపిస్తుంది. తెలుగుదేశం అభిమానులు కానీ,  బాలకృష్ణ  వీరాభిమానులుకానీ ఈ సినిమాని పట్టించు కున్న దాఖలాలు కనపడటం లేదని ఈ వసూళ్ళ తీరు తెలుపుతుంది.  
mahanayakuDu collections కోసం చిత్ర ఫలితం

చిత్రం తొలిభాగం ఎన్ టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా ₹50 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకురాగా, మ‌హానాయ‌కుడు కొత్త న‌ష్టాలు తీసుకొస్తుందనే నిర్ణయానికి వచ్చేసారు డిస్ట్రిబ్యూటర్స్.  దాంతో నష్టపరిహారం కోసం మళ్లీ వివాదం ప్రారంభం అయ్యేటట్లే ఉందనిపిస్తుంది. 



తెలుగు రాష్ట్రాల్లో మహానాయకుడు సినిమాకు మొదటి రోజు కేవలం ₹65 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేక న్పోవడం అవమానం. అంటే దీనర్థం, మహానాయకుడు సినిమాను నందమూరి అభిమానులు కూడా చాలా తేలికగా తీసుకున్నారన్నమాట. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే, నైజాం నుంచి సినిమాకు 42 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. అంటే షేర్ వాల్యూ నామ మాత్రం అన్నమాట. ఇక ఈస్ట్, నెల్లూరు లాంటి ప్రాంతాలైతే సింగిల్ డిజిట్ లక్షలకే  పరిమితమయాయి అంటే కథానాయకుడు ప్రభావం మహానాయకుడి పై ఎంతలా పడిందో అర్థం చేసుకోవచ్చు. 



మరో ముఖ్యమైన విషయం ఈ బయోపికల నిర్మాణ సమయంలో తెలుగుదేశం పార్టీ గౌరవం పరువు ప్రతిష్ఠ ఎంతలా దిగజారి పడిపోయిందోనని కూడా ఈ కలక్షణ్లు చెపుతున్నాయని అనుకోవచ్చా! 

NTR mahanayakuDu disastarous collection కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: