మూడు పదుల వయసు దాటిపోయినా టాప్ హీరోయిన్ గా తన స్థాయిని కొనసాగిస్తున్న కాజల్ కు ఇంకా చాలా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో ఈమె ఎప్పుడూ యాక్టివ్ గా సందడి చేసే నేపథ్యంలో ఈమెను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఈమధ్య తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో పోస్టుచేసిన ఒక వింత పోస్టు పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
ప్రేమలో పడిందా
కొద్దీ రోజుల క్రితం ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనే ఉండటంతో ఇప్పట్లో తన పెళ్ళి ఆలోచనలు లేవు అంటూ తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్పుల పై క్లారిటీ ఇచ్చింది. అయితే ఈమె లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో గోధుమ రంగు బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఒక ఇమేజ్ ని షేర్ చేస్తూ 'క్విక్ రిమైండర్ ఐ లవ్ యూ' అంటూ పోస్టు చేసింది. 
ఐలవ్యూ ఎవరి కోసం
అయితే ఆ వ్యక్తి యొక్క పేరు కానీ లేదంటే ఆ పేరుకు సంబంధించిన సంకేతాలు కానీ ఆ ఇమేజ్ లో ఏమీ కనిపించకపోవడంతో చాలామంది ఆశ్చర్యపడుతూ అసలు ఎవర్ని ఉద్దేశించి కాజల్ ఈ పోస్ట్ పెట్టింది అంటూ ఆమె అభిమానులు తీవ్ర పరిశోధనలు చేస్తున్నారు. ఆమధ్య ఒక బాలీవుడ్ పత్రిక కాజల్ ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఒక పారిశ్రామిక వేత్త కొడుకుతో పీకల లోతు ప్రేమలో ఉంది అంటూ వార్తలు వ్రాసింది. 
కమల్ హాసన్ సరసన
ఆతరువాత ఆ వార్తలు సద్దుమణిగి పోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కాజల్ పోస్టు చేసిన ఆ భావయుక్తమైన పోస్టు ఆ అజ్ఞాత ప్రేమికుడుకి సంబంధించిందే అంటూ మళ్ళీ ఊహాగానాలు మొదలు అయ్యాయి. మరొకొందరైతే కాజల్ పోస్ట్ చేసిన ఈ విచిత్రమైన పోస్టును చూసి ఆమె మానసిక ఆరోగ్యానికి ఏమైంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: