తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటుడు,దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు ప్రభుదేవా.  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా అక్కడ కూడా పలు హిట్ చిత్రాలు అందించారు.  ప్రస్తుతం  చెన్నైలో ఉంటూ నటనవైపు దృష్టి పెట్టాడు.  అప్పుడప్పుడు నిర్మాణం వైపు దృష్టి పెడుతూనే నటుడిగా బిజీ అవుతున్నాడు. 
Image result for krishan manohar ips prabudeva
తాజాగా తమిళంలో ఆయన చేసిన ఒక చిత్రాలు తెలుగులో 'కృష్ణమనోహర్ ఐపీఎస్' పేరుతో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుదేవా ఓ పవర్ ఫుల్ ఐపీఎస్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ కొద్ది సేపటి క్రితం రీలీజ్ చేశారు. తాను నమ్మిన సిద్దాంతం కరెక్ట్ అని తెలిసే వెనుకా ముందు ఆలోచించకుండా కఠినంగా శిక్షించే ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభుదేవా కనిపిస్తున్నాడు. 

‘పొలిటికల్ ఇన్ ఫ్లూలేన్స్ నేను చూసుకుంటాను..మన డిపార్ట్ మెంట్ నుంచి నాకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు.. నాకు తోచిందే నేను చేస్తాను సార్ ’ అంటూ టిజర్ ఎండింగ్ లో డైలాగ్ చూస్తుంటే ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.  ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: