‘లీడర్’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా ఆ తరువాత తనకు ఏర్పడ్డ ప్రత్యేకమైన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని విభిన్న పాత్రలలో నటిస్తూ తన ఇమేజ్ ని కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడ పెంచు కుంటున్నాడు. ‘బాహుబలి’ ‘ఘాజి’ లాంటి సినిమాల తరువాత రానా నేషనల్ సెలిబ్రిటీ స్థాయికి ఏదిగిపోయాడు.

ఈ నేపధ్యంలో ఒక ఆంగ్లపత్రిక ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న పోల్ పై రానా స్పందన  ఆసక్తి దాయకంగా మారింది.   బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అలియా భట్ లు నటించిన ‘గల్లీ బాయ్’ మూవీని దక్షిణాది భాషలలో రీమేక్ చేస్తే హీరోగా ఎవరు బాగుంటారు అన్న విషయమై ఆపత్రిక ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. 

ఈ ఆన్ లైన్ పోల్ లో ‘గల్లీ బాయ్’ రీమేక్ కు రానా విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ లలో ఎవరు నటిస్తే బాగుంటుంది అంటూ ఆ పత్రిక తన పాఠకులను ప్రశ్నించింది. ఈ విషయం రానా అభిమానుల దృష్టికి రావడంతో వారు అంతా ‘గల్లీ బాయ్’ రీమేక్ లో తప్పకుండా నటించమని ఒరిజినల్ మూవీలో ఉన్న రణవీర్ సింగ్ అలియా భట్ ల మధ్య చిత్రీకరించిన లిప్ లాక్ సీన్స్ రానాకు బాగా సూటు అవుతాయి అంటూ సరదాగా కామెంట్స్ చేసారు. 

అయితే వెంటనే రానా ఈ సూచన పై స్పందిస్తూ తనకంటే ఇలాంటి లిప్ లాక్ సీన్స్ విజయ్ దేవరకొండకు అదేవిధంగా అల్లు అర్జున్ కు బాగా సూటవుతాయని కామెంట్ చేసాడు. అంతేకాదు రణవీర్ సింగ్ స్థాయిలో నటించే స్థాయి తనకు లేదు అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు రానా..  



మరింత సమాచారం తెలుసుకోండి: