బెల్లంకొండ సురేష్ తనయుడిగా హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శీను సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన కవచం వరకు సినిమాలైతే చేస్తున్నాడు కాని ఒక్కటంటే ఒక్క కమర్షియల్ హిట్ కొట్టలేదు. మనోడు ఇమేజ్ తో సంబంధం లేకుండా బడ్జెట్ పెట్టేస్తారు. అంతేకాదు ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. 


సమంత, తమన్నా, రకుల్, పూజా హెగ్దె, కాజల్ ఇలా తన మొదటి సినిమా నుండి హీరోయిన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవని బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం చేస్తున్న సీత సినిమాలో కూడా కాజల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ తో పాటుగా ఆరెక్స్ భామ పాయల్ రాజ్ పుత్ కూడా నటిస్తుందని తెలిసిందే.


ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ సూపర్ హిట్ మూవీ రాక్షసన్ సినిమా రీమేక్ చేస్తున్నాడు. రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని తెలుస్తుంది. మళయాల ప్రేమమ్ సినిమాతో పాపులర్ అయిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. 


యువ హీరోలకు జోడీగా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బెల్లంకొండ బాబుతో రొమాన్స్ కు రెడీ అవుతుంది. ఆక్షసన్ తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా నటించారు. తమిళంలో సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: