టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు.  కొంత మంది సక్సెస్ అయితే..మరికొంత మంది కనిపించకుండా పోయారు.  అయితే హీరోయిన్ల తరుపు నుంచి గతంలో కొద్దిమంది హీరోలుగా పరిచయం అయినా..పెద్దగా సక్సెస్ సాధించలేక పోయారు.  టాలీవుడ్ లో సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రకూల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి టాప్ పోజీషన్ లోకి వెళ్లింది. 
Image result for rakul preet singh brother
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న రకూల్ కి ఈ మద్య తెలుగు లో అవకాశాలు తగ్గాయి.  వరుస సినిమాలు ప్లాప్ అవుతుండడంతో అమ్మడిని ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఆమె ఫ్యామిలీ నుంచి ఒక కథానాయకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. రకుల్ గత కొంత కాలంగా తన తమ్ముడు అమన్ ను సినీ ప్రపంచానికి పరిచయం చేయాలనీ అనుకుంటోంది. సరైన కథ కోసం ఎదురుచూసిన ఈ హీరోయిన్ రీసెంట్ గా ఒక మంచి కథను అమన్ కి సెట్ చేసింది.
Image result for rakul preet singh brother
కొంతకాలంగా ఈ వార్త వినిపిస్తున్నా, అన్ని పనులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయన్న మాట. 'అమన్' హీరోగా చేయనున్న ఈ సినిమాకి దర్శకుడు దాసరి లారెన్స్. రజినీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. బాలీవుడ్ లో అమన్ ఒక సినిమాను లో నటిస్తున్నట్లు సమాచారం.  యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న రెండు భాషల్లో ఈ ఏడాది చివరలో రానుందని సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: