‘మహానాయకుడు’ కలక్షన్స్ బాలకృష్ణ కెరియర్ కు సంబంధించి అత్యంత భయంకరంగా మారడంతో ఒక విధంగా ఎన్టీఆర్ బయోపిక్ తీసి బాలకృష్ణ ఎన్టీఆర్ పరువు తీసాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమాతో పోటీగా విడుదలైన నయనతార ‘అంజలి సిబిఐ’ కలక్షన్స్ మెరుగుగా ఉండటంతో అంజలి చేతిలో బాలయ్యకు ఘోర అవమానం అంటూ సెటైర్లు పడుతున్నాయి.

ఈమూవీ ద్వారా ఎన్టీఆర్ ప్రతిష్ఠ పెరగడం అటుంచి ఎన్టీఆర్ ప్రతిష్ఠ పరోక్షంగా దిగజారింది అంటూ నందమూరి వీరాభిమానులు కూడ లోలోపల కుమిలి పోతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పై చేసిన ఆరోపణలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 
Our review of Nandamuri Balakrishna's NTR Mahanayakudu!
ఎన్టీఆర్ మరణానికి కారకులు ఆయన కుటుంబ సభ్యులే అని చెపుతూ ఎన్టీఆర్ జీవించి ఉన్న కాలంలో ఆయన తిండికంటూ కొంత సొమ్మును పెట్టుకుంటే.. ఆ విషయంలోనూ కోర్టుకు వెళ్లారని.. ఆయన ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేసిన హింస తనకు తెలుసు అంటూ నాదెండ్ల చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పరపతిని దిగజార్చే విధంగా మారాయి. అయితే ఇదే కుటుంబ సభ్యులు తిరిగి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన చుట్టూ చేరిన విషయాలను వివరించాడు నాదెండ్ల.
Balakrishna in NTR Mahanayakudu
ఎన్టీఆర్ బయోపిక్ సెకెండ్ పార్ట్ లో తనను విలన్ గా చూపడం పై తన స్పందన తెలియ చేస్తూ ఆసినిమాను తాను చూడనప్పటికీ ఎన్టీఆర్ వారసులు తీసిన సినిమాలో అలాగే విషయాలు ఉంటాయని అభిప్రాయపడుతూ ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి విలన్ గా మారిన వ్యక్తిని పక్కకు పెట్టి తనను విలన్ గా చూపించడంలో తనకు ఆశ్చర్యం లేదు అంటూ ఘాటైన కామెంట్స్ చేసారు నాదెండ్ల. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి రెండు భాగాలు పరాజయం చెందడంతో ఇక ఇప్పుడు అందరి దృష్టి మార్చిలో విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఉంది. ఈ మూవీ విజయం సాధిస్తే ఒక విధంగా బాలకృష్ణ తన జీవితంలో మరిచిపోలేని పొరపాటును ఎన్టీఆర్ బయోపిక్ ను తీయడం ద్వారా చేసాడు అనే విషయం ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో మిగిలి పోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: