‘మహానాయుకుడు’ ఘోర పరాజయం పై రామ్ గోపాల్ వర్మ చేసిన వివాదాస్పద ట్విట్ కు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మహానాయకుడు ఘోర పరాజయం రాబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం ఓటమికి సంకేతం’ అంటూ వర్మ ట్విట్ చేసిన కొద్ది గంటలలోనే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న ఈమూవీని ఎట్టి పరిస్తుతులలోను 50 రోజులు ధియేటర్లలో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో
తెలుస్తున్న సమాచారం మేరకు ఏప్రియల్ నెలాఖరు వరకు ‘మహానాయకుడు’ ధియేటర్లలో కొనసాగేలా ఈ మూవీ ప్రదర్శింప బడుతున్న ధియేటర్లకు ముందుగానే అడ్వాన్స్ రెంట్ చెల్లించి ఈమూవీ ప్రదర్శింప బడుతున్న ముఖ్య కేంద్రాలలోని ధియేటర్లలో ఈమూవీ కొనసాగేలా చేసి అందరికి షాక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈవిషయంలో ధియేటర్లకు 50 రోజుల రెంట్ ను ముందుగానే చెల్లించడానికి కొందరు ఇండస్ట్రీ ప్రముఖ వ్యక్తుల సహకారంతో తెలుగుదేశం అధినాయకత్వం తన ప్రయత్నాలను ఇప్పటికే మొదలు పెట్టింది అని గాసిప్పులు వినిపిస్తున్నాయి.
డిజాస్టర్ టాక్
మార్చి రెండవ వారంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఆమూవీ విడుదల అయ్యే సమయానికి ‘మహానాయకుడు’ ధియేటర్లలో లేకపోవడం తీవ్ర అవమానంగా తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు టాక్. దీనితో ఇలా ఫ్లాప్ టాక్ వచ్చిన ఈమూవీకి వ్యూహాలు మారుస్తున్నట్లు సమాచారం.
‘ఆఫీసర్' వసూళ్లు...
అయితే ఇప్పటికే ‘మహానాయకుడు’ ఫెయిల్యూర్ టాక్ వైరల్ గా అందరికీ తెలిసిపోవడంతో కేవలం ప్రతిష్ఠ కోసం ప్రాకులాడుతూ ఖాళీ ధియేటర్లలో 50 రోజులు ‘మహానాయకుడు’ ని ప్రదర్శిస్తే ఈవిషయం ప్రజల దృష్టిలో మరింత సెటైర్లకు తావిచ్చే విధంగా మారుతుందని మరి కొందరి అభిప్రాయం అని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా ఇండస్ట్రీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన సినిమాను చూడటానికి నందమూరి అభిమానులు కూడ ఆసక్తి కనపరచక పోవడం దురదృష్టకరం అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: