జామురాతిరి జాబిలమ్మ అస్తమించి సరిగ్గా నేటి ఏడాది పూర్తయింది. ఫిబ్రవరి 24 దుబాయ్ లోని ఎమిరేట్ టవర్స్ లో బాత్ రూం లో గుండెనొప్పితో సిని తార శ్రీదేవి మరణించడం జరిగింది. ఆమె మరణం సిని ప్రపంచం మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది. 1963 తమిళనాడులోని శివకాశిలో జన్మించారు శ్రీదేవి.   


శ్రీదేవి తల్లిదండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్.. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయంగర్ అయ్యప్పన్ సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరు శ్రీదేవిగా మార్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన శ్రీదేవి 13 ఏళ్ల వయసులోనే మూండ్రు ముడిచ్చు అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా మారారు. తెలుగులో శ్రీదేవి మొదటి సినిమా అనురాగాలు. ఆ సినిమాలో శ్రీదేవి అంధురాలిగా నటించారు. 


తెలుగులో 85, తమిళంలో 72, మళయాళంలో 26, కనడలో 6, హిందిలో 71 చిత్రల్లో నటించారు శ్రీదేవి. తెలుగులో ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో నటించ శ్రీదేవి ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో కూడా జతకట్టింది. 2013లో ఆమెకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. శ్రీదేవి కెరియర్ ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. 14 సార్లు ఫిల్మ్ ఫేర్ కు నామినేట్ కాగా రెండు సార్లు బెస్ట్ యాక్ట్రెస్ గా మరో రెండు సార్లు స్పెషల్ జ్యూరీ అందుకున్నారు శ్రీదేవి.


1996లో బోనీ కపూర్ ను పెళ్లాడిన శ్రీదేవి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రీదేవికి జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈమధ్యనే జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి మరణించినా ఆమె సినిమాల జ్ఞాపకాలు ఎప్పుడు ఆమె అభిమానుల హృదయాల్లో నిలిచి ఉంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: