ఓ వ్యక్తిలోని టాలెంట్ ను గుర్తుపట్టిన వాడే అసలైన దర్శకుడు కాగలుగుతాడు. అలాంటి వారిలో ఇటీవల కన్నుమూసిన అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ ఒకరు. అందుకే ఆయన 100కు పైగా సినిమాలకు అలవోకగా దర్శకత్వం వహించి చరిత్ర పుటలకెక్క గలిగారు.

kodi ramakrishna hd కోసం చిత్ర ఫలితం


కోడి రామకృష్ణ ఎందరో కొత్త నటులను వెండితెరకు పరిచయం చేశారు. అలాంటి వారిలో అంకుశం విలన్ రామిరెడ్డి, బాబూ మోహన్, సుమన్, భానుచందర్, గౌతమి, కాస్ట్యూమ్స్ కృష్ణ వంటి వారు ఎందరో ఉన్నారు. అంకుశం సినిమాలో రామిరెడ్డి విలన్ గా నటించిన తీరు చాలా చిత్రమైంది.

సంబంధిత చిత్రం


అంకుశం గూండా రాజకీయాలు నేపథ్యంగా ఉన్న కథ.. ఈ సినిమాలో ఇద్దరు రౌడీ సోదరులు ఉంటారు. ఆ పాత్రల కోసం రామకృష్ణ ఇండస్ట్రీలో ఇప్పటికే ఉన్న ఎందరినో ట్రై చేశారు. కానీ ఆయన అనుకున్నట్టుగా ఎవరూ సరిపోవడం లేదు. ఆ సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి వోనర్‌ ఈ పాత్రకు బాగా సరిపోతారనిపించింది.

kodi ramakrishna RAMIREDDY కోసం చిత్ర ఫలితం


అంతే ఈ సినిమాలో ఆయనే మెయిన్ విలన్ గా సూటయ్యాడు. ఆయనే రామిరెడ్డి.. ఈ సినిమా తర్వాత స్పాట్ పెడ్తా అనే రామిరెడ్డి డైలాగ్ విపరీతంగా పాపులర్ అయ్యింది. రామిరెడ్డి కూడా చాలా కాలం విలన్ గా నటించాడు. అదీ కోడి రామకృష్ణ టాలెంట్.


మరింత సమాచారం తెలుసుకోండి: