కంటికి కనిపించేది ఏదీ నిజం కాదు, అలాగే కాంతి రేఖను చూసి చీకటి లేదనుకుంటే పొరపాటే. వెలుగు జిలుగుల అవతల ఏముంటుందో. అంబరాన్ని చుంబించే ఆనందాన్ని చూసిన కనులకు ఆవల ఏముందో అగుపిస్తుందా. వెండి తెరపై పండిన జీవితాలు వెలుపల కూడా అవే కాంతులు  వెదజల్లుతున్నాయా.


శ్రీదేవి జీవితం చూసుకుంటే కష్టాల నుంచి మొదలైన విషాదంతో ముగిసిన చరిత్రే కనిపిస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం  ఫిబ్రవరి 24 ఇదే  రోజు పిడుగు లాంటి వార్త శ్రీదేవి అభిమానులు వినాల్సివచ్చింది. దుబాయి లోని ఓ హొటల్ బాత్ టబ్ లో నిర్జీవం అయి ఉన్న శ్రీదేవి భౌతిక కాయం. షాక్ లాంటి న్యూస్ ఇది. ఎవరైనా విని భరించేందుకు ఒక్క గుండె సరిపోదు. కానీ తప్పదు. విని తీరాలి. అరిగించుకోవాలి. అలాంటి విషాదం ఇది. శ్రీదేవి ఎలా చనిపోయిందన్నది ఇప్పటికీ ఓ మిస్టరీ. చావు ఇలా కూడా వస్తుందా అన్నది కూడా సందేహం వచ్చేలా శ్రీదేవి మరణం ఘటన జరిగింది.


శ్రీదేవి చిన్నప్పట  నుంచి కష్టాలోనే పెరిగింది. ఆమె చదువు, ఎదుగుదల అంతా సినిమాలే. అక్కడే ఆమె ఓనామాలు దిద్దుకుంది. తెలుగులో సరైన టైంలో వచ్చిన శ్రీదేవి టాప్ స్టార్స్ అందరి పక్కన నటించి. వారి కెరీర్ కి కొత్త వూపిరి పోసింది. తన అందం, అభినయంతో  తెలుగు సినిమాకు కొత్త రంగులు అద్దింది.  అభిమానుల గుండెల్లో సొగసరి బొమ్మలా కొలువు తీరింది. 


ఇక బాలీవుడ్లోకి అడుగు పెట్టిన శ్రీదేవి వెనుతిరిగి చూసుకోలేదు. ఆమె అక్కడ తన టాలెంట్ తో రాణించి తొలి ఇండియన్ సూపర్ స్టార్ అనిపించుకుంది. ఇక పెళ్ళి కూడా ఓ వివాదమే. ఇద్దరు బిడ్డల తండ్రిని పెళ్ళి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ తినిపించింది.  ఇద్దరు ఆడ పిల్లల తల్లిగా జీవితాన్ని పండించుకున్న శ్రీదెవి తన కూతురుని కూడా గ్లామర్ ఫీల్డ్ లోకి తీసుకురావాలని అనుకుంది. ఇంతలోన  నిండా 54 ఏళ్ల వయసు కాకుండానే శ్రీదేవి అనూహ్యంగా అందరికీ దూరమైపోయింది.  ఇలా వినోదం వెనక విషాదం. ఇదే శ్రీదేవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.



మరింత సమాచారం తెలుసుకోండి: