యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను అబ్బురపరచేలా వస్తున్న ఈ సాహో సినిమా నుండి షేడ్స్ ఆఫ్ సాహో అంటూ ఓ మేకింగ్ వీడియో అప్పట్లో రిలీజైంది.


కృష్ణం రాజు బర్త్ డే సందర్భంగా వచ్చిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు మరో మేకింగ్ వీడియో సినిమా నుండి వస్తుందట. మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో పార్ట్ 2 వస్తుందట. ఈ వీడియోలో మరిన్ని అద్భుతాలు చూపిస్తారట. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా సాహో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.


డినో యురి 18 కెడబ్ల్యూ కెమెరాతో విజువల్స్ షూట్ చేశారట. తప్పకుండా ప్రతి సిని అభిమాని ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుందని అంటున్నారు. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు రెండు నెలల ముందు నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ రేంజ్ మరింత పెంచుతుందని అంటున్నారు.


ఒక్క యాక్షన్ పార్టే పాతిక కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమాకు ఆ సీన్ ఎంత బలమో అర్ధం చేసుకోవచ్చు. సాహో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ రెండో సినిమానే ఇంత భారీ బడ్జెట్ మూవీ చేయడం గొప్ప విషయం.



మరింత సమాచారం తెలుసుకోండి: