తెలుగు తెర హాస్యనటుడు ఆలీ తెలివైన నటుడు. అందుకే తన దోస్త్ జనసేన పార్టీలో చేరకుండా అపుడే రాజకీయం ఏంటో చూపించేశారు. ఇక బాలనటుడిగా కెరీర్ ప్రారంభిన అలీ తరువాత కాలంలో చిన్న పాత్రలు వేస్తూ ఓ దశలో హీరోగా కూడా కొన్ని మూవీస్ చేసి హిట్ అనిపించుకున్నారు. ఇపుడు సినిమాలు తగ్గడంతో ఆయన చూపు రాజకీయాలపై పడింది.

 

లేటెస్ట్ గా నలభయ్యేళ్ల సినీ జీవితం అంటూ అలీ విజయవాడలో తన సినీ సంబ రాలు జరుపుకున్నరు. ముఖ్య అతిదిగా వచ్చిన చంద్రబాబు అలీని పొగడ్లలతో ముంచెత్తారు అలీకి టీడీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా బాబు చెప్పుకొచ్చారు. కష్టపడి పైకి వచ్చిన ఆలీ ఎందరికో స్పూర్తి అంటూ కితాబులూ ఇచ్చారు. ఆ సం\భకు మొత్తం టీడీపీ రాజకీయ రంగు పడింది. దీన్ని బట్టి చూసినా, ముఖ్యమంత్రి మాటలను అర్ధం చేసుకున్నా అలీకి టీడీపీలో సీటు కంఫర్మ్ అయిందన్న మాట  గట్టిగా వినిపిస్తోంది.

 

అలీ తెలివిగా జగన్ తో మాటా మంతీ కలిపి మరీ తన ఇంపార్టన్స్ ని టీడీపీ గుర్తించేలా చేసుకోవడంతో సక్సెస్ అయ్యారు. ఇపుడు హఠాత్తుగా ఫార్టీ యియర్స్ సంబరాలు పేరు చెప్పి సీఎం బాబుని ఇన్వైట్ చేసి సీటుకు హామీ పొందారని సెటైర్లు పడుతున్నాయి.  టీడీపీలో రాజమండ్రీ అయినా, లేక గుంటూర్ సీటు అయినా అలీకి ఖాయమని అంటున్నారు. తొందరలోనే ఆలీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారన్న మాట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: