రకుల్ ఒకప్పుడు ఇండస్ట్రీ లో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్స్ సరసన చేరింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడుకు అవకాశాలు కరువయ్యాయి. వచ్చిన అవకాశాలు కూడా వచ్చినట్టే వచ్చి చేయి జారీపోతున్నాయి. కార్తితో ఖాకీ తరవాత చేసిన దేవ్ తనకు మంచి బ్రేక్ గా నిలుస్తుంది అనుకుంటే అది ఏకంగా ఆ హీరో కెరీర్ లోనే వరస్ట్ మూవీగా పేరు తెచ్చుకోవడంతో ఆశలన్నీ నీరుగారిపోయాయి.

Image result for rakul preet singh

దెబ్బకు టాలీవుడ్ సంగతేమో కాని ఇది ఇప్పుడు తమిళ్ అవకాశాలకే ఎసరు పెట్టేలా ఉంది. ఇదిలా ఉండగా వెంకటేష్ నాగ చైతన్య కాంబోలో రూపొందబోయే వెంకీ మామలో చైతుకి జోడిగా తొలుత అనుకున్నది రకుల్ నే. అయితే తర్వాత ఏం జరిగిందో కాని ఫైనల్ గా ఆ సీటులోకి రాశి ఖన్నా వచ్చి కూర్చుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న రట్ససన్ రీమేక్ లో కూడా రకుల్ నే అడిగారట. సడన్ గా అనుపమ పరమేశ్వరన్ సీన్ లోకి వచ్చేసి ఆ ఛాన్స్ తీసేసుకుంది.

Image result for rakul preet singh

ఇప్పుడు విడిగా ఎవరైనా పిలుస్తారేమో అని చూస్తే దేవ్ ఫలితం దెబ్బకు మేనేజర్ కు కాల్స్ రావడం కూడా ఆగిపోయాయి. రకుల్ కు ఇదంతా ఇబ్బంది కలిగించే వ్యవహారమే. గతంలో దర్శకుడు హరీష్ శంకర్ దాగుడుమూతలు అనే కామెడీ మల్టీ స్టారర్ అనుకున్నప్పుడు ఒక హీరొయిన్ గా రకుల్ నే అనుకున్నారు. అయితే అది మొదలుకాకుండానే ఆగిపోయింది. హరీష్ శంకర్ దాన్ని వదిలేసి వరుణ్ తేజ్ తో వాల్మీకికి షిఫ్ట్ అయిపోయాడు. అయినా రకుల్ కి నో కాల్. సూర్యతో నంద గోపాల కృష్ణన్ చేసింది కాని అందులో తనకన్నా సాయి పల్లవి పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని ఇప్పటికే కోలీవుడ్ టాక్ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: