నాగార్జునకు హ్యాండివ్వడం అంటే మామూలు విషయం కాదు, పైగా ఆయన ఎంతో టెన్షన్ తో తన భాయ్ సినిమాను పూర్తి చేయాలని తెగ తాపత్రయ పడుతున్న సమయంలో అదే పనికి బ్రేకులు పడేలా ఈ ఎన్నారై అందగత్తే నాగార్జునకు హ్యండిచ్చిందని ఫిల్మ్ నగర్ లో ఒకటే గుసగుసలు.

తాజాగా అందరి హీరోలు సినిమాలు ఆగిపోవడంతో నాగార్జున తనే నిర్మాతగా, హీరోగా తీస్తున్న ‘భాయ్’ సినిమాను వచ్చె నెల 4న విడుదల చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది, కేవలం ఒకటే పాట మిగిలి ఉంది. ఇది కూడా శరవేగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మూడునాలుగురోజుల నుంచి స్పీడ్ గా చిత్రీకరణ జరుగుతోంది.

ఈ పాటకోసం నాగార్జున, డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్ రాజుసుందరంలు  రెడీగా ఉన్నారు సెట్లో. కాని అసలుసిసలైన ఎన్నారై అందగత్తె ఈ సినిమాకు హీరోయిన్ రిచాగంగోపాద్యాయ రాలేదు, అంతకు ముందు రానని కూడా సమాచారం ఇవ్వలేదట. వెయిటింగ్ భరించలేక సినిమా యూనిట్ వారు ఫోన్ చేస్తే ఒంట్లో బాగోలేదు, ఈ రోజుకు వాయిదా వేసుకోండి అందట రిచా. దీంతో నాగార్జున కల్పించుకుని స్వయంగా బతిమాలినా కూడా ఆమె నో చెప్పిందంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: