‘మహానాయకుడు’ ఘోర పరాభవం తరువాత వెనువెంటనే ఒకే వేదిక పైకి బాలకృష్ణ జూనియర్ లు రాబోతున్న నేపధ్యం ఇప్పడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘కధానాయకుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ వచ్చిన తరువాత ఆసినిమా విదుదల అయ్యాక కాని అదేవిధంగా ‘మహానాయకుడు’ విడుదల అయ్యాక కాని జూనియర్ ఒక్క మాట కూడ మాట్లాడలేదు. 
Kalyan Ram in 118
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అయిన ‘ఎఫ్ 2’ గురించి ప్రశంసలు కురిపించిన జూనియర్ తాత ఎన్టీఆర్ బయోపిక్ గురించి అదేవిధంగా బాలకృష్ణ నటన గురించి ఆ సినిమా విడుదల అయ్యాక ఒక్క మాట కూడ మాట్లాడలేదు. దీనికితోడు ‘కథానాయకుడు’ ‘మహానాయకుడు’ ప్రీమియర్ షోలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు కాని జూనియర్ మాత్రం రాలేదు. 
118 Teaser: Suspense is the hallmark of this thriller starring Nandamuri Kalyanram, Shalini Pandey and Nivetha Thomas – watch video
దీనితో జూనియర్ ను బాలయ్య పిలవలేదా ? లేదంటే పిలిచినా జూనియర్ స్పందించ లేదా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘మహానాయకుడు’ కి ఘోర పరాభవం జరిగి వారంరోజులు కూడ కాకుండానే ఈరోజు కళ్యాణ్ రామ్ ’118’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ బాలయ్యలు కలిసి రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు జూనియర్ తన బాబాయ్ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో చేసిన నటన గురించి కనీసం నందమూరి అభిమానుల కోసమైనా మాట్లాడవలసిన పరిస్థుతులు ఎదురౌతున్నాయి. 
Kalyan Ram, Kalyan Ram Court Scene Talk Ism Movie, Kalyan Ram Court Scene Performance Ism Movie Climax, Kalyan Ram Court Scene Highlight Ism Movie
అయితే ఇలాంటి సున్నితమైన సమస్యలను చాల తెలివిగా తన మాటలతో జూనియర్ తప్పించుకుంటాడు అని అతడి సన్నిహితులు అంటూ ఉంటారు. అందువల్ల ఈరోజు జూనియర్ చేయబోయే ప్రసంగం పై అందరి దృష్టి ఉంది. దీనికితోడు మరికొద్ది రోజులలో ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో జూనియర్ బాలయ్యల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అని మరొకసారి సంకేతాలు ఇవ్వడానికి తమ మధ్య ఉన్న గ్యాప్ ను బయటపడనీయకుండా మరొకసారి లైవ్ ఈవెంట్ లో నటించడానికి జూనియర్ బాలయ్యలు వస్తున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: