‘ఎఫ్ 2’ సక్సస్స్ ను రిపీట్ చేయాలని వెంకటేష్ నటిస్తున్న మరో మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’ షూటింగ్ నిన్న రాజమండ్రిలో మొదలు అయింది.  ‘ఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంలో  కామెడీ పార్ట్ బాగా ప్రభావం  చూపించింది అన్న కామెంట్స్ రావడంతో ‘వెంకీ మామ’ సినిమాలో కూడా అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ లో భారీ మార్పుచేర్పులు చేశారుఅని తెలుస్తోంది. నెలరోజులు ఎక్స్ ట్రా టైమ్ తీసుకుని మరీ ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ ఈమూవీ లో విపరీతంగా చూపించబోతున్నట్లు టాక్.
Venky Mama Muhurat Pictures  
ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ‘వెంకీ మామ’ మూవీని నిన్న మొదలుపెట్టినా ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఈసినిమాను నిన్న ప్రారంభం రోజు నుండి వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో చైతన్య మిలట్రీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. 
Venky Mama To Dominate Again
వాస్తవానికి ఈమూవీలో స్క్రిప్ట్ రీత్యా ఎమోషనల్ పార్ట్ ఎక్కువట. అయితే ‘ఎఫ్ 2’ కావడంతో ఎయోషన్ తో పాటు హాస్యం పార్ట్ కూడ ఈసినిమాలో పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. భావోద్వేగాలు పండించడంలో వెంకటేష్ సమర్ధతను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుని ఇప్పుడు కామెడీ పార్ట్ ను పెంచడంతో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసే విషయంలో తికమకపడుతున్నట్లు టాక్. 
Venky Chaitu Movie Title Fixed Is Venkymama
దీనికితోడు నాగచైతన్య నటించిన యాక్షన్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయిన నేపధ్యంలో ఈమూవీలో కూడ చైతూ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో సెంటిమెంట్ రీత్యా ఆ సీన్స్ ను తగ్గించమని నిర్మాత సురేశ్ బాబు సూచించినట్లు తెలుస్తోంది. చైతూ కెరియర్ కు సంబంధించి త్వరలో విడుదల కాబోతున్న ‘మజిలీ’ విషయంలో సమంత పై ఆధారపడితే ‘వెంకీ మామ’ విషయంలో చైతూ తన మేనమామ వెంకటేష్ పై ఆధారపడుతున్నాడు అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: