చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచ అత్యున్నత అవార్డు ఆస్కార్‌ 2019ను ప్రకటించారు. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ స్టేడియంలో 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ సహాయనటిగా రెజినా కింగ్‌ను ఈ ఏడాది ఆస్కార్‌ వరించింది.  లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకలో ప్రముఖ హాలీవుడ్‌ తారా గణమంతా సందడి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి పురస్కార ప్రదానోత్సవం ప్రారంభమైంది. ‘బ్లాక్ పాంథర్‌’, ‘రోమా’ చిత్రాలకు అవార్డుల పంటపండింది. 



ఆస్కార్ విజేతలు వీరే : 

ఉత్తమ చిత్రం: గ్రీన్‌ బుక్‌

ఉత్తమ దర్శకుడు- ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా)

ఉత్తమ నటుడు: రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ)ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌)ఉత్తమ సహాయ నటి- రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)ఉత్తమ సహాయ నటుడు- మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్‌)​​​​​​​

ఉత్తమ ఛాయాగ్రాహకుడు- అల్ఫాన్సో కరోన్‌(రోమా)

ఉత్తమ విదేశీ చిత్రం- ‘రోమా’

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం- ‘ఫ్రీ సోలో’

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: పీరియడ్‌: ది ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ (భారతీయ చిత్రం)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌- ‘బ్లాక్‌ పాంథర్‌‘

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌- రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌)

ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌- బొహెమియన్‌ రాప్సోడి

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- ‘స్పైడర్‌ మ్యాన్‌:ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌) 


మరింత సమాచారం తెలుసుకోండి: