టాలీవుడ్ లో ఆ మద్య కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని యూట్యూబ్ ఛానల్స్ లో తన ఇంటర్వ్యూలో ఊదరగొట్టింది నటి శ్రీరెడ్డి.  కాకపోతే ఆ సమయంలో ఈమెను ఎవరు పట్టించుకోలేదు. తనకు మా అసోసియేషన్ వారు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో ఒక్కసారే నేషనల్ మీడియా స్థాయిలో పాపులారిటీ సంపాదించింది.  అప్పటి నుంచి మీడియా శ్రీరెడ్డిని తెగ ఫాలో అయ్యింది.  దాంతో తన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాన్ ని బండబూతులు తిట్టింది.  దాంతో శ్రీరెడ్డిపై ఒక్కసారిగా విమర్శలు వచ్చాయి..విషయాన్ని పక్కదోవ పట్టించిందంటూ ఎవరూ చెబితే పవన్ ని తిట్టిందంటూ శ్రీరెడ్డికి అంతా వ్యతిరేఖం అయ్యారు. 

అప్పటి నుంచి కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీరెడ్డి తర్వాత మకాం చెన్నైకి మార్చింది.  అప్పుడప్పుడు ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ లు అయితే పెడుతుంది కాని ఇంటర్వ్యూలు అయితే తక్కువ చేసింది.   చాలా కాలం తర్వాత శ్రీరెడ్డి మళ్లీ ఇంటర్వ్యూల ఇవ్వడం ప్రారంభించింది. ఒక స్టార్ హీరోపై అన్ని ఇంటర్వ్యూల్లో సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో మరో అడుగు ముందుకు వేసి మరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. 
Related image
ఆ హీరోను నేను చాలా నమ్మాను అతడు కూడా నాకు హీరోయిన్ గా కాకున్నా కనీసం సెకండ్ హీరోయిన్ గా అయినా ఛాన్స్ ఇప్పిస్తాను అన్నాడు. ఆ హీరోకి కేవలం అమ్మాయిల పిచ్చే కాదు..తాగుడు స్మోకింగ్ డ్రగ్స్ ఇలా చాలా అలవాట్లే ఉన్నాయి. డ్రగ్స్ కేసు నడుస్తున్న సమయంలో నా ఇంటికి డ్రగ్స్ తెచ్చాడు.  పెళ్లికి ముందు సెక్సువల్ గా ఇద్దరం కూడా బాగా ఎంజాయ్ చేశామని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాకపోతే ఆ హీరో పేరు మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతూ వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: