ఈ మద్య టాలీవుడ్ లో హర్రర్, కామెడీ సినిమాలు బాగానే వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే పైసా వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి.  కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు కొంత కాలంగా హర్రర్ జోనర్ లో వస్తున్న సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు.  హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో ప్రముఖ నటుడు, దర్శకుడు లారెన్స్ ఇప్పటి వరకు ముని, కాంచన,కాంచన్ 2 సినిమాలు తీశారు. ప్రస్తుతం కాంచన 3 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.  ఆ మద్య టాలీవుడ్ లో వచ్చిన 'గీతాంజలి' .. 'త్రిపుర' మంచి హిట్ అయ్యాయి. 
Image result for 'విశ్వామిత్ర' ట్రైలర్
ఈ రెండు సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న రాజకిరణ్, తాజాగా మరో హారర్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నాడు. గతంలో మారుతి దర్శకత్వంలో సుదీర్ బాబు హీరోగా నటించిన ‘ప్రేమ కథాచిత్రమ్’సినిమాలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందితా రాజ్  ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, 'విశ్వామిత్ర' అనే టైటిల్ ను ఆయన ఖాయం చేశారు.  తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరి కాంబినేషన్స్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
Image result for 'విశ్వామిత్ర' ట్రైలర్
ఈ  సినిమాలో ప్రసన్న పోలీసు అధికారి పాత్రలో నటించారు.  ఈ సినిమాలో నందితకు ఓ అజ్ఞాత వ్యక్తి కనిపించకుండా సాయం చేస్తుంటాడు. కానీ అతను ప్రాణాలతో ఉండడు. ఇదే విషయం గురించి నందిత పోలీసు అధికారి ప్రసన్నకు చెబుతుంది. ఇదంతా నీ భ్రమ అని కొట్టిపడేస్తాడు ప్రసన్న. అంతే కాదు ‘చనిపోయివాడు వచ్చి నీ సమస్యలు తీర్చాడంటే నమ్మడానికి నేను పిల్లోడిని కాను పోలీసోడిని’ అని ప్రసన్న ఆమె మాటలను కొట్టిపారేస్తాడు.
Image result for 'విశ్వామిత్ర' ట్రైలర్
‘ఈ విశ్వంలో మానవ మేథస్సుకు అందని విషయాలు చాలా ఉన్నాయి’ అంటూ ఆసక్తికరమైన అంశాలతో సినిమాను తెరకెక్కించారు. మార్చ్ 21న విడుదల కానున్న విశ్వామిత్ర టైటిల్ వెనుక సస్పెన్స్ కూడా ఇందులో చూపలేదు కాని ఆ అజ్ఞాత వ్యక్తి పేరే అయ్యుంటుందనే క్లూ మాత్రం ఇచ్చారు. మార్చ్ 21న విడుదల కానున్న విశ్వామిత్ర టైటిల్ వెనుక సస్పెన్స్ కూడా ఇందులో చూపలేదు కాని ఆ అజ్ఞాత వ్యక్తి పేరే అయ్యుంటుందనే క్లూ మాత్రం ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: