ఈ మద్య వరుసగా తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తెలుగు లో ప్రముఖ దర్శకులు సుబ్బిరామిరెడ్డి మరణం మరువక ముందే..మరో స్టార్ దర్శకులు,నటులు కోడి రామకృష్ణ కన్నమూశారు.  తాజాగా మాలీవుడ్ యువ దర్శకురాలు నయన సూర్యన్ (28) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 
Image result for kollywood women director nayana suryan
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె పలువురు సీనియర్ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.  2017లో దర్శకురాలిగా మారింది. ఆమె మృతిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ… పోస్ట్ మార్టం నివేదిక అందితే కానీ, మృతికి గల కారణాలను చెప్పలేమన్నారు.  నయన సూర్యన్ కొంత కాలంగా మధుమేహ వ్యాధికి ఆమె చికిత్స పొందుతోందని అన్నారు. 
Image result for kollywood women director nayana suryan
నయన తల్లి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నయన స్నేహితులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది.  ఇంటికి వెళ్లిన నయన స్నేహితులకు.. బెడ్ రూమ్ లో ఆమె చనిపోయి కనిపించింది.  దాంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం తెలపడంతో .. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: