సినీరంగం అంటేనే అనేక చిత్ర విచిత్రాల సమాహారం. ఒక్కోసారి అనుకోకుండా చేసిన చిత్రం బ్లాక్ బ్లస్టర్ అవుతుంది.. ఎంతో కష్టపడి సినిమా చేసినా అట్టర్ ఫ్లాప్ అవుతుంటుంది. ఒక స్టార్ చేయాల్సిన సినిమా మరో స్టార్ కు కలిసొస్తుంది.. ఇలాంటిదే యమలీల సినిమా కూడా. అసలు ఈ సినిమాలో మహేశ్ బాబు హీరోగా నటించాల్సి ఉందట. కానీ అనుకోకుండా అలీ హీరోగా ఈ చిత్రం ద్వారా బంపర్ హిట్ కొట్టేశాడు. ఇటీవల ఓ సభలో అలీ ఈ విషయం బయటపెట్టాడు.

సంబంధిత చిత్రం


ఎస్వీ కృష్ణారెడ్డి గారు 'యమలీల' కథను మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేసుకున్నారట. హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో వెళుతోన్న సందర్భంలో కృష్ణారెడ్డిగారు ఈ కథను కృష్ణగారికి వినిపించారట. మహేశ్ బాబు చదువు పూర్తికావడానికి సమయం పడుతుందని కృష్ణ చెప్పారట.

yamaleela hd pic కోసం చిత్ర ఫలితం


చదువు పూర్తి కాకుండా మహేశ్ సినిమాలు చేయడని కృష్ణగారు కన్ ఫామ్ చేశారట. దాంతో ఎస్వీ కృష్ణారెడ్డి వేరే హీరో కోసం వెదుకులాట ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన కన్ను అలీ పై పడింది. అలీని హీరోగా పెట్టుకోవద్దని కూడా ఆయనకి చాలామంది చెప్పారట

సంబంధిత చిత్రం


ఎస్వీ కృష్ణారెడ్డి కథను నమ్మారు .. అందువల్లనే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. హీరోగా ఒక సినిమా హిట్ కాగానే నా అంత తోపు ఎవరూ లేడని తాను అనుకోలేదంటున్నాడు అలీ. అందువల్లనే కమెడియన్ వేషాలను వదులుకోలేదని వివరణ ఇచ్చాడు. ఏదేమైనా రాసి పెట్టి ఉండాలని అందుకే అంటారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: