సాధారణంగా హీరోలు తాము నటించిన సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ సినిమాకు సంబంధించిన విషయాలను తన అభిమానులకు షేర్ చేస్తూ ఆమూవీ పై అంచనాలు పెరిగేలా చేస్తూ ఉంటారు. అయితే నిన్న రాత్రి జరిగిన ‘118’ మూవీ ఫంక్షన్ లో ఆ సినిమా విషయాలు కళ్యాణ్ రామ్ కన్నా ఎక్కువగా జూనియర్ వివరించడం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ‘118’ మూవీ విజయం గురించి కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎంత టెన్షన్ పడుతున్నాడో అర్ధం అయ్యేలా చేసింది. 
షాలిని పాండే గ్లామర్ కూడా
ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చిన బాలకృష్ణకు స్వాగతం పలకడం దగ్గర నుంచి ఈమూవీ ఫంక్షన్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని జూనియర్ పట్టించుకుంటూ ఇది తన సినిమా కూడ అన్న సంకేతాలు ఇచ్చాడు. ఈమూవీ దర్శకుడు గుహన్ గురించి మాట్లాడుతూ తాను నటించిన ‘బాద్షా’ షూటింగ్ సమయంలో ‘బంతిపూల జానకి’ పాట కోసం మైనస్ 16 డిగ్రీల చలిలో అతడు పడ్డ కష్టం గురించి వివరిస్తూ ఎలాంటి వ్యతిరేక పరిస్థుతులలో అయినా అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చే గుహన్ ‘118’ విషయంలో చేసిన అద్భుతాలను వివరించాడు. 
నివేదా థామస్ నటన కళ్లనీళ్లు పెట్టించింది
ఇదే సందర్భంలో ఈమూవీలో హీరోయిన్ గా నటించిన నివేదితా థామస్ ఈసినిమాకు సంబంధించి ఒక సీన్ లో నటించిన నటన చూసి తనకు తెలియకుండానే తన కంట కన్నీరు వచ్చిన విషయాలను వివరించి ఈమూవీ పై అంచనాలు పెరిగేలా సహకరించాడు. మరొ హీరోయిన్ గా నటించిన శాలినీ పాండే గ్లామర్ ఈమూవీకి మరో బలం అని చెపుతూ జూనియర్ ఈసినిమాలలో నటించిన ప్రతి ఒక్కరి గురించి చాల వివరంగా మాట్లాడాడు.
 బాద్షాలో చిత్రంలో బంతిపూల జానకి‌ పాట కోసం
హీరో కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ ఈమూవీతో కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోతుందని చెపుతూ ప్రయోగాలు చేయడంలో కళ్యాణ్ రామ్ కు ఉన్న సాహసం తనకు లేదు అన్న విషయాన్ని వివరించాడు. అయితే సాధారణంగా ఇలా సినిమాకు సంబంధించిన అన్ని  విషయాలు ఆమూవీ హీరో చెపుతూ ఉంటాడు. అయితే కళ్యాణ్ రామ్ బదులు జూనియర్ ఈ బాధ్యతను తీసుకుని వివరించడంతో బాలయ్యతో పాటు సమానంగా మూడీగా కనిపించిన కళ్యాణ్ రామ్ చెప్పలేని విషయాలను జూనియర్ కవర్ చేసి ‘మహానాయకుడు’ షాక్ లో బాలయ్యతో పాటు సమానంగా ఉన్న కళ్యాణ్ రామ్ ను ’118’ ఫంక్షన్ గురించి ఆలోచించేలా చేసాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: