‘బిగ్ బాస్ 2’ షోతో టాప్ హీరోల స్థాయిలో సెలెబ్రెటీగా మారిపోయిన కౌశల్ ఇమేజ్ కి ఊహించని విధంగా గండి పడింది. నిన్నసాయంత్రం ఒకప్రముఖ న్యూస్ ఛానల్ కౌశల్ నిజస్వరూపాన్ని బయటపెడుతూ కౌశల్ అభిమానులతో నిర్వహించిన చర్చా కార్యక్రమం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ అభిమానులుగా చెప్పుకుంటున్న అనేకమంది ఆచర్చా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా కౌశల్ వ్యక్తిత్వం పై విపరీతమైన విమర్శలు చేసారు. 
ఆయన భార్య నీలిమ రెచ్చగొట్టింది
ఈకార్యక్రమంలో పాల్గొన్న కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమ్మాన్ మాట్లాడుతూ కౌశల్ అభిమానులు ఎవరు అతడి దగ్గరకు వెళ్ళినా వారిచేత డబ్బు ఖర్చు పెట్టిస్తు ఫ్లైట్ టిక్కెట్స్ హోటల్స్ కూడ తమ డబ్బుతోనే బుక్ చేయిస్తూ ఉంటాడనీ తమ ఆవేదన బయటపెట్టాడు. ఇలాంటి సందర్భంలో కొంతమంది అభిమానులు తమ వద్ద డబ్బు లేకపోతే క్రెడిట్ కార్డులు వాడి తమ ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి కౌశల్ కోసం ఖర్చుపెట్టిన విషయాలను వివరిస్తూ ఆతరువాత కౌశల్ అసలు రూపం తెలిసి తాము నష్టపోయిన విషయాలను వివరించాడు. 
రాయల సీమ అధ్యక్షుడి గోడు
కౌశల్ లాంటి వ్యక్తి ప్రవర్తన వల్ల సమాజానికి ప్రమాదకరం అంటూ కౌశల్ ఆర్మీ సభ్యులు పిలుపును ఇవ్వడం సంచలనంగా మారింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అనామిక అనే కౌశల్ ఫ్యాన్ మాట్లాడుతూ కౌశల్ ను ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే తనను ప్రశ్నించిన వారిని అందర్నీ గ్రూఫ్ నుంచి తీసేస్తున్న విషయాలను వివరిస్తూ తాను కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కు 10 వేలు విరాళం ఇచ్చిన వ్యక్తిని అని చెపుతూ తనకు ప్రశ్నించే హక్కు లేదా అంటూ ఆమె గగ్గోలు పెడుతోంది. ఇదే సందర్భంలో కౌశల్ ఆర్మీ రాయలసీమ విభాగ అధ్యక్షుడు తాను అనంతపూర్ కర్నూల్ జిల్లాలలో జరిగిన సక్సస్ మీట్స్ కోసం లక్షలలో ఖర్చుపెట్టిన విషయాలను వివరిస్తూ ఒక మెసేజ్ పెడితే కౌశల్ తన పై రివర్స్ అయి తిట్లు తిట్టిన విషయాలను వివరించాడు. 
కౌశల్ ఫౌండేషన్ డబ్బులు పక్కదారి
మరో కౌశల్ అభిమాని తాను కౌశల్ తో సినిమా తీయాలని ప్రయత్నిస్తే ఆ విషయమై ఆసినిమా నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యవహారాలలో ఒక ఆఫీసు బాయ్ కి రోజుకు రెండువేలు చొప్పున ఖర్చులు రాస్తే ఆ ఖర్చులు తట్టుకోలేక తాను సినిమా నిర్మాణం విరమించుకున్న విషయాలను వివరించాడు. ఇక చివరిగా కౌశల్ తన ప్రైజ్ మనీ 50 లక్షలతో సమాజ కార్యక్రమాలు చేస్తానని నమ్మించి ఒక్క పనిచేయకుండా తామందరి చేత భారీ మొత్తాలు పెట్టించిన కౌశల్ నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలని కౌశల్ అభిమానులు చేసిన తిరుగుబాటు ఇప్పుడు సంచలనంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: