సినీ నటులు కొన్ని సార్లు బహిరంగ ప్రదేశాల్లో తిరిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి.  హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది..కొంత మంది ఆకతాయిలు వారి శరీరంపై ఎక్కడెక్కడో చేతులు వేస్తూ వారిని నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సంచలన నటుడిగా పేరు తెచ్చుకున్న  నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఓ చేదు అనుభవం ఎదురైంది.0

‘రాత్ అకేలీ హై’ సినిమా షూటింగ్‌ కోసం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు వెళ్లిన నవాజుద్దీన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు.  ఆ సమయంలో మనోడి వద్దకు కొంత మంది ఫ్యాన్స్ వచ్చారు..అందులో ఓ యువకుడు నవాజుద్దీన్‌ సెల్ఫీ తీసుకునేందేకు ఏకంగా మెడలపై చేయి వేసి దగ్గరకు లాగాడు.

ఆ ఫ్యాన్ చేసి అతి చూసి నబాజుద్దీన్ ఒక్కసారే షాక్ కి గురయ్యాడు. వెంటనే అతని సిబ్బంది వచ్చి ఆ యువకుడిని పక్కక్కు లాగడంతో వెంటనే తన కారులోకి వెళ్లి కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: