తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘ఈశ్వర్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ప్రభాస్ కి పెద్దగా గుర్తింపు రాలేదు.  రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి’చిత్రం తర్వాత మనోడి స్టార్ పూర్తిగా మారిపోయింది.  వరుసగా మిర్చి, డాల్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయిలో ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకున్నాడు.  బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’చిత్రంలో నటిస్తున్నాడు.  ప్రభాస్ సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. మార్చి 3వ తేదీన శ్రద్ధా కపూర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేయనున్నారు.

ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన చిన్న టీజర్ తప్ప ఏదీ అప్ డేట్ చేయలేదు.  తాజాగా శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా  వీడియోను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: