పుల్వామాపై జరిగిన దాడికి ప్రతిదాడిగా నేడు తెల్లవారు జామున  నియంత్రణ రేఖను దాటి బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది.   మిరాజ్‌-2000 యుద్ధ విమానాల ద్వారా దాదాపు వెయ్యి కిలోల బరువున్న బాంబులతో ఈ దాడి చేపట్టింది. కాగా.. ఈ ఘటనలో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.
Image result for indian air force attack
నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని తెలిపారు. వైమానిక దళ ఫైటర్‌ జెట్స్‌ ఎల్‌ఓసీ దాటి ఈ దాడులు నిర్వహించాయి.  కాగా ఈ దాడులను కీర్తిస్తూ యావత్ భారత దేశం సంబరాలు జరుపుకుంటుంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు వైమానిక దళాలను ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖలు భారత్‌ చేపట్టిన మెరుపుదాడులపై హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 
Image result for indian air force attack
మహేష్ బాబు, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తదితరులు తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా, పాక్ లోకి దూసుకెళ్లి దాడులు చేసి పెద్దఎత్తున ఉగ్రవాదులను హతమార్చి వచ్చిన వాయుసేన దళాలపై ప్రశంసలు కురిపించారు.
 
- మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్" అన్నారు. 
- ఎన్టీఆర్ "మన దేశం గట్టి జవాబు ఇచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా" 
-సెల్యూట్ టూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్... జై హింద్" : రాజమౌళి
- "భారత వాయుసేనను చూసి గర్విస్తున్నా... జై హింద్"  : రాంచరణ్
- భారత వైమానిక దళానికి సెల్యూట్‌. జై హో. జై హింద్‌’- నితిన్‌
- ‘సెల్యూట్‌ ఐఏఎఫ్‌. మన దేశానికి ఎంతో గర్వకారమైన రోజిది’- అఖిల్‌
- జై హింద్‌. ఈ మెరుపు దాడుల వార్త నిజమేనని ఆశిస్తున్నా’- మంచు విష్ణు
- భారత వైమానిక దళాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’- ఉపాసన
- బుల్లెట్‌ దిగిందా లేదా..’- పూరీ జగన్నాథ్‌
- చేతులు ముడుచుకుని కూర్చునే టైం కాదని ప్రపంచానికి మనం నిరూపించాం. భారత వైమానిక దళానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’- కల్యాణ్‌రామ్‌
- ఎవడు కొడితే ఉగ్ర శిబిరాలన్నీ బ్లాక్‌ అయిపోతాయో వాళ్లే మన సైనికులు’- బ్రహ్మాజీ
- ‘జైషే పరిస్థితి ఎలా ఉంది?.. ‘నాశనమైపోయింది‌’- రష్మి 

మరింత సమాచారం తెలుసుకోండి: