అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా గౌతం మీనన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఏమాయ చేసావె. ఈ సినిమాను మహేష్ సోదరి సూపర్ స్టార్ కృష్ణ తనయురాలు మంజుల నిర్మించారు. 2010 ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజైంది. ఈ సినిమా రిలీజై 9 ఏళ్లు అవుతున్న సందర్భంగా సినిమా నిర్మాత ట్వీట్ చేశారు. 


తొమ్మిదేళ్లు అవుతుంది.. అయినా నిన్ననే అంతా జరిగినట్టు ఉంది అంటూ ఆ సినిమాకు పనిచేసిన అందరికి అభినందనలు తెలిపారు మంజుల. అయితే ఈ మెసేజ్ కు రిప్లై గా తన జీవితాన్ని మార్చేసిన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు. అంతేకాదు తనని ఇంతలా ఆదరిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు సమంత.


ఈ సినిమాలో నటించిన తర్వాతనే చైతు, సమంతల మధ్య ప్రేమ మొదలైంది. అయితే వీరి ప్రేమ ముదిరి పాకాన పడి 2017 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఏమాయ చేసావే సినిమా నుండి సమంత స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరియర్ లో అదే జోరు కొనసాగిస్తుంది సమంత.


ప్రస్తుతం నాగ చైతన్యతో మజిలీ సినిమా చేస్తున్న సమంత నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ బేబీ ఎంత సక్కగున్నావే సినిమా కూడా చేస్తుంది. వీటితో పాటుగా 96 మూవీ రీమేక్ లో సమంత నటిస్తుందని తెలిసిందే. కోలీవుడ్ లో సూపర్ డీలక్స్ అంటూ ఓ సినిమా చేస్తుంది సమంత. పెళ్లి తర్వాత ఈ రేంజ్ ఫాం కొనసాగించడం అంటే మాములు విషయం కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: