ప్రపంచ దేశాలకు పెద్దన్న అమెరికా అధ్యక్షుడిని అంటారు.  ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఎన్నో కార్టూన్లు, మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  తాజాగా మరోసారి డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పెషల్ అయ్యారు..కాకపోతే ఈసారి బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కి సంబంధించిన డ్యాన్సును మార్ఫింగ్ చేశారు. 

రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొని కాంబినేషన్ లో వచ్చిన  'బాజీరావ్ మస్తానీ'  చిత్రంలోని హిట్ సాంగ్ లో రణవీర్ తల స్థానంలో ట్రంప్ తలను ఉంచారు. ఈ పాటలో ట్రంప్ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేలా మార్ఫింగ్ చేయడం నిజంగా అద్భుతంగా ఉంది.  అంతే కాదు ఈ వీడియోకి 'పేష్వా వారియర్ ట్రంప్' అనే పేరు పెట్టారు.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: